Site icon HashtagU Telugu

Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?

5.2kg Newborn

5.2kg Newborn

సాధారణంగా శిశువులు 2.5 నుండి 3.2 కిలోల బరువుతో జన్మిస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌(Jabalpur)లో ఒక అరుదైన సంఘటన జరిగింది. అక్కడ ఒక మహిళ 5.2 కిలోల (5.2kg baby through c-section) భారీ బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సాధారణ బరువుకు రెట్టింపు బరువుతో జన్మించిన ఈ శిశువును చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ బరువుతో అతను ఒక ఏడాది వయస్సున్న పిల్లవాడిలా కనిపించాడు.

Harish Rao : రేపు KCRతో హరీశ్ భేటీ..ఏంచెప్పబోతున్నాడో..!!

జబల్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 34 ఏళ్ల మహిళ(Shubhangi)కు డెలివరీ జరిగింది. సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో, వైద్యులు సిజేరియన్ ద్వారా శిశువును బయటకు తీశారు. శిశువు బరువు చూసి వైద్య బృందం ఆశ్చర్యపోయింది. ఇంత బరువైన శిశువును చూడటం తమ జీవితంలో ఇదే మొదటిసారి అని వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. సంబరపడిపోయిన వైద్యులు శిశువుతో కలిసి ఫోటోలు దిగారు.

ఈ అసాధారణ జననం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణ బరువు కంటే ఎక్కువగా ఉన్న శిశువులను ‘మాక్రోసోమియా’గా పరిగణిస్తారు. తల్లికి మధుమేహం ఉండటం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల ఇలాంటి భారీ శిశువులు జన్మించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా, తల్లి మరియు శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటం ఆనందకరమైన విషయం. ఈ శిశువుకు స్థానికులు “బాలభీముడు” అనే పేరు పెట్టారు.

Exit mobile version