Site icon HashtagU Telugu

Black Tiger : ఆ అడవిలో బ్లాక్ టైగర్ హల్ చల్.. వీడియో వైరల్

Black Tiger

Black Tiger

Black Tiger :  అరుదైన బ్లాక్ టైగర్ ఎట్టకేలకు కనిపించింది.

ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో ఇది సీసీ కెమెరా కంటపడింది. 

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్ హ్యాండిల్‌లో బ్లాక్ టైగర్ తిరుగుతున్న వీడియో ఫుటేజీని షేర్ చేశారు. 

“సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లోని కెమెరా ట్రాప్ వీడియో ఇది.. జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఈ అడవిలోనే అరుదైన బ్లాక్ టైగర్ సంతతి కనిపిస్తుంటుంది” అని ఆయన తన పోస్ట్ లో ప్రస్తావించారు.  

ఆగస్టు 1న ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటిదాకా  67వేల వ్యూస్ వచ్చాయి.

Also read : Vande Bharat Express: త్వరలో ‘హైదరాబాద్- బెంగళూరు’ వందే భారత్ రైలు ప్రారంభం

వాస్తవానికి ఈ వీడియో క్లిప్‌ను ఐఎఫ్‌ఎస్ అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడ తొలుత జులై 31న  ట్విట్టర్ లో  పోస్ట్ చేశారు. “సిమిలిపాల్‌లో గత నాలుగేళ్లలో పులుల జనాభా రెట్టింపు అయింది” అని ఆయన  పేర్కొన్నారు.  “మా సిబ్బంది కృషి, నిబద్ధత, అంకితభావం, త్యాగ నిరతి వల్ల ఫలితాలు కనిపిస్తున్నాయి.  2018 జనాభా లెక్కలతో పోలిస్తే పులుల సంఖ్య రెండింతలు పెరిగింది.. మీ అందరికీ ప్రపంచ రేంజర్ దినోత్సవ శుభాకాంక్షలు” అని డాక్టర్ సామ్రాట్ గౌడ రాశారు. ఆ మరుసటి రోజే (ఆగస్టు 1న)  దాన్ని ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్ హ్యాండిల్‌లోనూ  షేర్ చేశారు. అయితే పులుల్లో జన్యు ఉత్పరివర్తనాలు, సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో  బ్లాక్ టైగర్స్ ఉనికిపై(Black Tiger) నెటిజన్స్ మధ్య కూలంకష చర్చ జరిగింది.