“అలేఖ్య చిట్టి పికిల్స్” (Alekhya Chitti Pickles Controversy) పేరుతో కాంచర్ల అలేఖ్య (Alekhya ) నిర్వహిస్తున్న పికిల్స్ వ్యాపారం (Pickles Business) ఇటీవల ఊహించని వివాదంలో చిక్కుకుంది. నాన్-వెజ్ పికిల్స్ తయారీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, ఆన్‌లైన్‌లో ఎంతో ప్రజాదరణ పొందింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఈ వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు నడుపుతున్నారు. అయితే ఓ కస్టమర్‌తో అలేఖ్య చేసిన అసభ్య సంభాషణ ఆడియో లీక్ కావడంతో, ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల గురించి ప్రశ్నించిన కస్టమర్‌ను బూతులతో తిట్టిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
Telugu States Alert : ఏపీ, తెలంగాణలకు అలర్ట్.. వర్షాలు, పిడుగుపాట్లు, ఈదురుగాలులు
ఈ క్రమంలో అలేఖ్య చిట్టి ఒక వీడియో ద్వారా స్పందించారు. తన మాటలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు కోరారు. కానీ నెటిజన్లు మాత్రం ఆమె వ్యవహారాన్ని వ్యాపార నైతికతకు విరుద్ధంగా అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, వ్యంగ్య వీడియోలు విపరీతంగా షేర్ చేయడం చేసారు. వ్యాపార రంగంలో కస్టమర్లతో వ్యవహరించే తీరు ఎంతో కీలకం అని, అలేఖ్య ప్రవర్తన దురదృష్టకరమని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన తో అలేఖ్య వ్యాపారం నష్టాలబాట పట్టడం మొదలైంది.
సోషల్ మీడియా లో విమర్శలు రావడం, బిజినెస్ కూడా తగ్గిపోవడం తో అలేఖ్య బెంగపెట్టుకొని హాస్పటల్ పాలైంది . శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుండడం తో ఆమెను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చగా, ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు, వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోదరి ఒక వీడియో ద్వారా వెల్లడించారు.