Ram Charan: జీ20 వేదిక‌పై నాటు నాటు సాంగ్‌.. దక్షిణ కొరియా రాయబారితో స్టెప్పులేసిన రామ్ చరణ్..!

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాజరయ్యారు.

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 07:46 AM IST

Ram Charan: జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాజరయ్యారు. సోమవారం శ్రీనగర్‌లోని SKICC (షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్)లో ‘ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్’ అనే అంశంపై జరిగిన G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ 3వ మీటింగ్‌కు రామ్ చరణ్ హాజరయ్యారు. అంతకుముందు ఆయన శ్రీనగర్ విమానాశ్రయంలో కనిపించారు.

నాటు-నాటు పాటకు డ్యాన్స్

జీ20 వేదికపై భారతదేశంలోని దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బోక్‌తో కలిసి రామ్ చరణ్ తన ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటు పాటకి డాన్స్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడి అభిమానులు అతన్ని ‘ట్రూ గ్లోబల్ స్టార్’ అని పిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్ మయాంక్ శేఖర్‌తో రామ్ చరణ్ ఫిల్మ్ టూరిజం గురించి చర్చించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: RRR Actor Ray Stevenson: ‘ఆర్ఆర్ఆర్’లో విలన్ పాత్ర పోషించిన రే స్టీవెన్‌సన్ కన్నుమూత

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్‌లో పాటకు ముందు చాంగ్ జే-బోక్, అతని సిబ్బంది నాటు నాటుకు డ్యాన్స్ చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఈ పాటకు స్వరకర్త MM కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కింద ఆస్కార్‌ అవార్డును గెలుపొందారు.

కశ్మీర్‌లో ఆర్టికల్‌-370ను తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు, పూర్వ పర్యాటక వైభవ పునరుద్ధరణకు ఇక్కడ సదస్సు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం మొదలైన ఈ సదస్సు మే 24 వరకు జరగనుంది. పర్యాటక, వాణిజ్యరంగాలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నారు. శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

ఆర్థిక పురోగతిలో ఫిల్మ్ టూరిజం పాత్ర, సాంస్కృతిక పరిరక్షణ అంశాలపై జరుగుతున్న ఈ సమావేశాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు చరణ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే అరుదైన గౌరవం చరణ్‌కు దక్కింది. ఎంతో అద్భుతమై ప్రకృతి అందాలతో నిండి ఉండే కశ్మీర్‌లో ఈ కార్యక్రమం జరగడం హ్యాపీగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు.