Site icon HashtagU Telugu

Viral Video: రాజస్థాన్‌ ఎడారుల్లో ఇసుక వేడితో పాపడ్ కాల్చిన BSF సైనికులు

Viral Video

Viral Video

Viral Video: రాజస్థాన్‌లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎండ వేడిమి, కరెంటు కోతలతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక సరిహద్దు భద్రతా దళాల పరిస్థితి వర్ణనాతీతం. భానుడి ప్రతాపానిక్ బీఎస్పీ (BSF) సైనికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కింద ఇసుక, పైన వేడితో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్ ఎడారుల్లో వారి పరిస్థితి ఏంటో ఓ బీఎస్పీ సైనికుడు అందరికి తెలిసేలా ఓ వీడియోని విడుదల చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది.

రాజస్థాన్‌ బికనీర్‌లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఈ మండుతున్న వేడి మధ్య, సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికుడి వీడియో బయటపడింది. మండుతున్న వేడి ఇసుకలో పాపడ్ కాల్చడం అందర్నీ ఆలోచింపజేస్తుంది. పాపడ్ కేవలం కొన్ని సెకన్లలో ఉడికిపోతుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ అసాధారణ పరిస్థితులలో కూడా మనల్ని సురక్షితంగా ఉంచే మన సైనికుల పట్ల అపారమైన గౌరవం మరియు కృతజ్ఞతా భావాన్ని సృష్టించింది అని ఎక్స్ ద్వారా పంచుకున్నారు.

రాష్ట్రంలోని జుంజును జిల్లా పిలానీలో వరుసగా రెండో రోజు బుధవారం ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆదేశాల మేరకు డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, సబ్‌డివిజన్ అధికారులు, నీటి సరఫరా, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Also Read: Samantha : నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.. సమంత ఎవరి కోసం ఈ ప్రార్ధనలు..?

Exit mobile version