Site icon HashtagU Telugu

Rain : హైదరాబాద్ లో విచిత్రం..రెండు ఇళ్ల మద్యే వర్షం

Rain 2 Housed

Rain 2 Housed

వర్షం (Rain)..ఇది ఎప్పుడు పడుతుందో..ఏ రేంజ్ లో పడుతుందో..ఎక్కడ పడుతుందో ఎవ్వరు చెప్పలేరు. అలాగే ఓ చోట పడి మరోచోట పడకుండా ఉంటుంది..ఎండా..వాన కలిసి పడుతుంటుంది..ఇలాంటి నిత్యం జరుగుతూనే ఉంటుంది. అయితే హైదరాబాద్ లో ఓ విచిత్రం జరిగింది. కేవలం 10 మీటర్ల పరిధిలోనే వర్షం పడి అందర్నీ ఆశ్చర్యం వేసింది. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. గత పదిరోజులుగా హైదరాబాద్ (HYderabad) లో ఏ రేంజ్ లో వర్షం పడుతుందో తెలియంది కాదు. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టి..సడెన్ గా వాతావరణం మరి వర్షం దంచికొడుతుంది. అది కూడా మాములుగా కాదు రోడ్ల ఫై పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకపోయేలా వర్షం పడుతుంది. మొన్నటి వరకు సాయంత్రం అయితే చాలు వరణుడు వణికించాడు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే గురువారం మాత్రం నగరంలో ఓ విచిత్రం జరిగింది. కేవలం ఓ ప్రాంతంలో 10 మీటర్ల పరిధిలో మాత్రమే వర్షం పడింది. హైదరాబాద్ – మురద్‌నగర్ కాలనీలో మేఘానికి చిల్లు పడిందా అన్న రీతిలో కేవలం ఒక్క ఇంటి ముందే ఆరడుగుల వ్యాసార్థంలో వర్షం పడింది. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Top 5 CM : టాప్ 5 సీఎంలలో చంద్రబాబు

Exit mobile version