Site icon HashtagU Telugu

Punjab Shocker: 55 ఏళ్ల మహిళను నగ్నంగా ఊరేగింపు

Punjab Shocker

Punjab Shocker

Punjab Shocker: పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది. కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడంతో అమ్మాయి తరుపు బంధువులు అబ్బాయి ఇంటికి వెళ్లి తన తల్లిని వివస్త్రను చేసి నగ్నంగా రోడ్లపై ఊరేగించారు. పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లాలోని ఒక గ్రామంలో 55 ఏళ్ల మహిళను కొట్టి నగ్నంగా ఊరేగించారు. వివరాలలోకి వెళితే..

బాధితురాలి కొడుకు తన ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకుని పారిపోయాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడంతో ఈ అవమానకరమైన సంఘటన జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడి చేసినవారు మహిళ బట్టలు విప్పి, ఆపై ఆమెను పాక్షిక నగ్నంగా గ్రామ వీధుల్లో ఊరేగించారు. సమాజం సైతం తలదించుకునే ఈ రాక్షస చర్యకు పాల్పడిన వారిని వదిలిపెట్టవద్దని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

We’re now on WhatsAppClick to Join

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354 (ఆమె నమ్రతను అగౌరవపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 354B కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. వీటితో పాటుగా 354డి, 323 మరియు 149 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురిపై కేసులు నమోదు చేశామని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వారు తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని కుల్విందర్ కౌర్ మణి, శరంజిత్ సింగ్ షానీ, గుర్చరణ్ సింగ్‌లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. వీలైనంత త్వరగా వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఒక అధికారి తెలిపారు, ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Also Read: Manjummel Boys Review : ‘మంజుమ్మల్ బాయ్స్’ రివ్యూ.. కమల్ హాసన్ లవ్ సాంగ్ వెనుక ఇంత కథ ఉందా..!