86 Push Ups In 1 Minute : 1 నిమిషంలో 86 పుషప్ లు ఎలా కొట్టాడో చూడండి .. ‘పుషప్ మ్యాన్’ వరల్డ్ రికార్డు

86 Push Ups In 1 Minute :  ఎప్పుడూ జిమ్‌కు వెళ్లని ఓ పంజాబ్ యువకుడు వరుస గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులతో సత్తా చాటుకుంటున్నాడు. అందరితో ‘పుషప్ మ్యాన్ ఆఫ్ పంజాబ్’ గా పిలిపించుకుంటున్నాడు. 

Published By: HashtagU Telugu Desk
86 Push Ups In 1 Minute

86 Push Ups In 1 Minute

86 Push Ups In 1 Minute :  ఎప్పుడూ జిమ్‌కు వెళ్లని ఓ పంజాబ్ యువకుడు వరుస గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులతో సత్తా చాటుకుంటున్నాడు. అందరితో ‘పుషప్ మ్యాన్ ఆఫ్ పంజాబ్’ గా పిలిపించుకుంటున్నాడు. ఇప్పటికే నాలుగు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులను సాధించిన  అతగాడు.. తాజాగా మరో ఫీట్ తో ఇంకో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గురుదాస్‌పూర్ జిల్లాలోని ఉమర్‌వాలా గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు కువార్ అమృత్‌బీర్ సింగ్‌ ఒకే ఒక నిమిషంలో 86 పుషప్‌లు చేసి కొత్త రికార్డును నమోదు చేశాడు. ఇంతకుముందు ఓ ఔత్సాహికుడు.. 1 నిమిషంలో 80 పుషప్ లు చేసిన నెలకొల్పిన రికార్డును అవలీలగా తిరగరాశాడు. 9.78 కిలోల బరువును వీపుపై మోస్తూ ఒకే ఒక నిమిషంలో 86 పుషప్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు.  ఇన్‌స్టాగ్రామ్‌లో అమృత్‌బీర్ సింగ్‌ కు 2 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. అతడు చేసే ఫీట్లను చూసేందుకు.. చాలామంది ఇన్ స్టాలో ఫాలో అవుతుంటారు.

Also read : Presidential Bid : కలలో దేవత చెప్పింది.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్న అపర కుబేరుడు!

‘‘ఫిట్ నెస్ కోసం జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.. నేను ఇటుకలు, ఇసుక సంచులు, సిమెంట్‌ బ్యాగ్, ప్లాస్టిక్ సంచులు,  ఖాళీ సీసాలు, ఇనుప రాడ్లతో జిమ్ చేస్తుంటాను’’ అని చాలాసార్లు అమృత్‌బీర్  చెప్పాడు.  ‘పెహెల్వాన్లు జిమ్‌లకు వెళ్లరు’ అని తన ఫాలోయర్లతో అమృత్‌బీర్ (86 Push Ups In 1 Minute) అంటుంటాడు. 1 నిమిషంలో 86 పుషప్ లు చేయడానికి ముందు.. 25 రోజుల పాటు రోజూ ఉదయం 4 గంటల పాటు, సాయంత్రం 4 గంటల పాటు పుషప్ లను తాను ప్రాక్టీస్ చేశానని తెలిపాడు.   “నా ఫుడ్ మెనూలో పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, లస్సీ తప్పనిసరిగా ఉంటాయి’’ అని వివరించాడు. ‘మా నాన్న, మామ ఇద్దరూ క్రీడా ప్రియులే. వాళ్ల స్ఫూర్తితో నేను ఆ విధంగా ఫీట్స్ చేయడంపై ఆసక్తి పెంచుకున్నాను’ అని ఆయన చెప్పాడు.

  Last Updated: 28 Aug 2023, 11:29 AM IST