Tirumala : శ్రీవారి సన్నిధానంలో గోల్డెన్ బాయ్స్ హల్చల్..భక్తుల చూపంతా వీరి బంగారంపైనే

మాములుగా బంగారాన్ని ఎక్కువగా మహిళలే దరిస్తారని అందరికి తెలుసు. కానీ ఇటీవల మహిళలే కాదు పురుషులు కూడా భారీగా బంగారాన్ని మేడలో , చేతులకు వేసుకొని హల్చల్ చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
25kgs Pune

25kgs Pune

తిరుమల క్షేత్రానికి ( Tirumala Venkateswara Temple) ప్రతి రోజు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. కేవలం సామాన్య ప్రజలే కాదు సమాజంలో ఎంతో పలుకుబడి ఉన్న రాజకీయ నేతలు , బిజినెస్ రంగ ప్రముఖులు, సినీ తారలు , క్రీడాకారులు ఇలా ఒకరేంటి అనేక రంగాల వారు ప్రతి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. సినీ ప్రముఖులు హాజరైనప్పుడు భక్తులు వారిని చూసేందుకు పోటీ పడుతుంటారు ఇది కామన్. కానీ అప్పుడప్పుడు ఇతర వ్యక్తులను చూసేందుకు కూడా పోటీపడుతుంటారు. ఈరోజు కూడా అదే జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

మాములుగా బంగారాన్ని ఎక్కువగా మహిళలే దరిస్తారని అందరికి తెలుసు. కానీ ఇటీవల మహిళలే కాదు పురుషులు కూడా భారీగా బంగారాన్ని మేడలో , చేతులకు వేసుకొని హల్చల్ చేస్తున్నారు. అలాంటి వారిలో పుణెకు చెందిన గోల్డ్ బాయ్స్ ఒకరు. పుణెకు చెందిన గోల్డ్ బాయ్స్, సన్నీ నన వాగ్చోరీ , సంజయ్ దత్తత్రయ గుజర్ , ప్రీతి సోనిలు ఈరోజు శుక్రవారం ఉదయం VIP దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీళ్ల ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి భక్తులు షాక్ తో అలాఉండిపోయారు. వీరిని చూడటానికి, ఫోటోలు దిగడానికి భక్తులు ఎగబడ్డారు. వీరు ధరించిన ఆభరణాలు దాదాపు 25 కేజీలు (25 kilograms of gold) ఉంటుందని చెబుతున్నారు.. ఈ బంగారం ధర రూ.కోట్లలో ఉంటుందని అంత బంగారం వీరు ఎలా సంపాదించారో… కేజీల కొద్దీ బంగారాన్ని ఒంటిపై దిగేసుకుని రావడంతో ఈ ముగ్గుర్ని మిగతా భక్తులు కళ్లు పెద్దవి చేసి మరీ చూశారు. మెడలో తాళ్ల సైజులో గొలుసులు, చేతికి కడియాలు, ఉంగరాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : Prabhas : ప్రభాస్ స్పిరిట్ లో త్రిష.. ట్విస్ట్ ఏంటంటే..?

  Last Updated: 23 Aug 2024, 01:16 PM IST