Site icon HashtagU Telugu

Priyanka Gandhi: హోటల్లో పిండి కలిపి దోసెలు పోసిన ప్రియాంక గాంధీ.. ఫొటోస్ వైరల్?

Priyanka Gandhi

Priyanka Gandhi

కర్ణాటకలో వచ్చేనెల అనగా మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన హంగామా మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో ఆమె సందడి చేసింది. మైసూరు లోని మైలారి అగ్రహార రెస్టారెంట్ కు వెళ్ళింది. అంతేకాకుండా ఫోటోలు లోకి వెళ్లిన ఆమె కిచెన్ లోకి వెళ్లి తన చేతితో పిండి కలిపి మరీ దోశలు వేశారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ ఉదయం లెజెండ్రీ మైలారి రెస్టారెంట్ యజమానులతో కలిసి దోసెలు చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజాయితీగా కష్టపడి పని చేయడం వ్యాపారానికి చాలా ముఖ్యం అని ఆమె రాసుకొచ్చింది. కాగా ఆ వీడియోలో ప్రియాంక గాంధీ తో పాటుగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జ్ రణ్ దీప్ సుర్జేవాలా తో పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ప్రియాంక రాకను చూసిన ఆ హోటల్స్ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

 

ఆమెను లోపలికి ఆహ్వానించారు. తర్వాత ప్రియాంక దోశలు వేస్తుండగా అది చూసి సంతోషపడ్డారు. ప్రియాంక కూడా దోసెలు పోస్తూ చాలా సంతోషంగా కనిపించారు. అనంతరం కస్టమర్లతో సరదాగా మాట్లాడారు ప్రియాంక గాంధీ. ఆ తర్వాత అక్కడే ఉన్న చిన్నారులతో కలిసి సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు అదే హోటల్లో టిఫిన్ కూడా చేశారు. ప్రియాంకతో పాటు పార్టీ నేతలు అందరూ కూడా అక్కడ టిఫిన్ తిన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.