1 Painting – Rs 3700 Crores : ఆ పెయింటింగ్ ను రూ.3700 కోట్లకు కొన్నదెవరో తెలిసిపోయింది!

1 Painting - Rs 3700 Crores :  ఆ ఒక్క పెయింట్.. వేలంపాటలో రూ.3700 కోట్లకు అమ్ముడుపోయింది. ఇంతకీ అదేం గొప్ప పెయింట్ అనుకుంటున్నారా.. ? 

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 02:02 PM IST

1 Painting – Rs 3700 Crores :  ఆ ఒక్క పెయింట్.. వేలంపాటలో రూ.3700 కోట్లకు అమ్ముడుపోయింది. 

ఇంతకీ అదేం గొప్ప పెయింటింగ్ అనుకుంటున్నారా.. ? 

విశ్వ విఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన ‘సాల్వేటర్ ముండి’ పెయింటింగ్ అది.. 

దీన్ని క్రిస్టీస్ సంస్థ 2017లో న్యూయార్క్‌ సిటీలో వేలంగా వేయగా గుర్తు తెలియని వ్యక్తి రూ.3700 కోట్లకు కొనేశాడు. 

అయితే దాన్ని కొన్నదెవరో అప్పట్లో వెల్లడికాలేదు. 

ఎట్టకేలకు ఆ పెయింటింగ్ ను ఎవరు కొన్నారో తెలిసిపోయింది.. 

Also read : Dying Declarations – Caution : మరణ వాంగ్మూలాన్ని నమ్మాలా ? వద్దా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సౌదీ అరేబియా రాజ కుటుంబానికి ఒక వ్యక్తి  ఈ పెయింటింగ్‌ను కొన్నాడని (1 Painting – Rs 3700 Crores) తేలిపోయింది. ఈ వేలంపాటను ఆనాడు లైవ్ లో చూస్తున్న సౌదీ రాజ కుటుంబ వ్యక్తి.. ధర పెరిగేదాకా వెయిట్ చేశారట. దాని ధర రూ.3000 కోట్లకు చేరే దాకా సైలెంట్ గా చూశారట. చివరకు  వేలం సంస్థ క్రిస్టీస్ సహ-ఛైర్మన్ అలెక్స్ రోటర్ కు కాల్ చేసి.. ఆ పెయింటింగ్ కోసం తమ తరఫున రూ.3700 కోట్లకు బిడ్ వేయాలని చెప్పారట. దీంతో ఆయన రూ.3700 కోట్లకు బిడ్ దాఖలు చేశారు. దీంతో పోటీ లేకుండానే ఆ పెయింటింగ్ సౌదీ రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆ గుర్తు తెలియని వ్యక్తి సొంతమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి చెందిన టాటా మోటార్స్ రూ. 2,728 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అయితే లియోనార్డో డావిన్సీ గీసిన ‘సాల్వేటర్ ముండి’ పెయింటింగ్ అంతకంటే వెయ్యి కోట్లు ఎక్కువగా అమ్ముడుపోవడం విశేషం.

Also read : Pragyan Rover Moon Walk : చందమామపై చిట్టి ‘ప్రజ్ఞాన్’ బుడిబుడి అడుగులు.. వీడియో వైరల్