Site icon HashtagU Telugu

Prank Video : అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిలిపి వీడియో తప్పుగా మారింది

Prank Video Goes Wrong Between Boy And Girl

Prank Video Goes Wrong Between Boy And Girl

Prank Video : ఈమద్య యువత ప్రాంక్ వీడియో అంటూ చేస్తున్న వింతలు అందరికీ తెలిసిందే. ప్రాంక్ అనేది సరదాగా అనిపించాలి తప్ప అది ఒకరికి ఇబ్బంది కలిగించకూడదు. కొన్ని ప్రాంక్ లు సాహసోపేతంగా ఉంటాయి. ప్రాంక్ (Prank) ల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఢిల్లీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ప్రాంక్ వీడియో చేసి అక్కడ వారిని బకరా చేద్దామని అనుకున్నారు. కానీ అది రివర్స్ అయ్యింది.

అమ్మాయి అబ్బాయి గొడవ పడినట్టు చేస్తున్న ప్రాంక్ అనూహ్యంగా సరదాగా మొదలై నిజంగానే తన్నుకున్నంత పని చేశారు. ప్రాంక్ వీడియో (Prank Video)లో భాగంగా అమ్మాయి అబ్బాయి ముందు గొడవ పడ్డారు. అది కాస్త ముదిరి అమ్మాయి అబ్బాయి మీద చేయి చేసుకుంది. అలా ఒకసారి అయితే ఓకే అలా మూడు నాలుగు సార్లు అతని చెంప పగలగొట్టింది. అలా చేయడం వల్ల ఆ అబ్బాయి కూడా సహనం కోల్పోయి అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు.

ప్రాంక్ లో భాగంగానే ఇలా చేశారా లేదా నిమగానే వారు కొట్టుకుంటున్నారా అన్నది తెలియక చుట్టూ జనాలు మాత్రం ఏదో వింత చూస్తున్నట్టు చూశారు. ప్రాంక్ అది సరదాగా చేస్తే బాగుంటుంది కానీ ఇలా నడి రోడ్డు మీద కొట్టుకునేలా ఉంటే మాత్రం అది వేరే విధంగా దారి తీస్తుంది.

ఈ వీడియో 7 లక్షల దాకా చూశారు. ప్రాంక్ అని చెప్పి ఏది పడితే అలా చేస్తే చూసే వాళ్లకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. హాస్యాస్పదంగా ఉండాలి కానీ ఒకరిని ఇబ్బంది పెట్టేలా ఉన్న ఏ ప్రాంక్ అయినా సరైనది కాదని చెప్పొచ్చు.

Also Read :  Mobile Phone : ఉదయం లేవగానే ఫోన్ చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?