Site icon HashtagU Telugu

Viral : ప్రధాన మంత్రి ప్రచార మంత్రిగా.. ప్రకాష్ రాజ్ ట్వీట్

Prakashraj Tweet

Prakashraj Tweet

జాతీయ స్థాయిలో పేరొందిన నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) మరోసారి మోడీ(Modi)పై పరోక్షంగా విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి మోడీని పట్టుకొని “ప్రచార మంత్రి” (Pracharamantri) అంటూ ట్రోల్ చేశారు. “నాకు తెలిసి ప్రచార మంత్రి ఇమేజ్ బిల్డింగ్ కోసం ఏదైనా చేస్తారు. మీరేమంటారు?” అని ప్రశ్నిస్తూ ఈ పోస్టుకు ఆరబెట్టిన పులిచర్మం, నక్క ఫొటోని పెట్టారు. ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీనిని మోదీపై తీవ్ర వ్యంగ్యంగా చూస్తుండగా, మరికొందరు ఇది అనవసర విమర్శగా అభిప్రాయపడుతున్నారు.

Mirror : మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

ప్రకాశ్ రాజ్ రాజకీయ అంశాల్లో తరచూ స్పందించే వ్యక్తి. ఆయన గతంలోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానిగా మోదీ పనిచేస్తున్న తీరు, ప్రచారంలో వినియోగించే రీతిని పలు సందర్భాల్లో ఆయన ప్రశ్నించారు. తాజాగా చేసిన ఈ ట్వీట్ ద్వారా ఆయన మోదీపై పరోక్షంగా “ఇమేజ్ బిల్డింగ్” మంత్రిగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న నక్క–పులి సెటప్ ఈ వ్యాఖ్యలకు మరింత పదును చేకూర్చింది.

అయితే ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. “MAA” (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో కూడా గెలవలేని వ్యక్తి ప్రధాని మోదీపై విమర్శలు చేయడం ఏంత వరకూ సమంజసం? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ప్రకాష్ రాజ్‌ తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు ఉందని కొంతమంది ఆయనను సమర్థిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే, ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారి తీసింది.