ఒడిశా రాష్ట్రం (Odisha) జగత్సింగ్‌పూర్ జిల్లాలో ఓ మహిళా హోంగార్డు(Female Home Guard)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్న ఎస్సై (SI) చివరకు దారుణంగా మోసం చేశాడు. ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వీరిద్దరూ స్నేహితులుగా ఉండగా, ఆ స్నేహం ప్రేమగా మారింది. ఎస్సై పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి హోంగార్డుతో అక్రమ సంబంధం కొనసాగించాడు. అయితే కొంతకాలం తర్వాత ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం తెలియడంతో ఎస్సై తన మాటను మార్చేశాడు. దీంతో మోసపోయిన హోంగార్డు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Samantha : రష్మికకు స్పెషల్ గిఫ్ట్ పంపిన సమంత.. బిగ్ లవ్ అంటూ రష్మిక రెస్పాన్స్..
ఫిర్యాదు అనంతరం పోలీసులు ఈ కేసును విచారణకు తీసుకున్నారు. విచారణలో నిందితుడైన ఎస్సై ఇప్పటికే వివాహితుడిగా ఉన్నట్లు వెల్లడైంది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేకుండానే హోంగార్డును మోసం చేసినట్లు ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు నిందితుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా చర్యలు ప్రారంభించారు. మహిళా హోంగార్డు న్యాయం కోసం గట్టిగా పోరాడడంతో ఎస్సైపై నిర్బంధ చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా, అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు ఎస్సైను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాసేవ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి దురాచారాలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు అమలులో ఉన్నంతవరకు నిందితుడు కటక్ సెంట్రల్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రమశిక్షణా నియంత్రణలో ఉంటారని పేర్కొన్నారు.