Site icon HashtagU Telugu

Kumari Aunty : కుమారీ ఆంటీ పొట్టకొట్టిన యూట్యూబర్స్

Kumari Aunty Food

Kumari Aunty Food

కుమారీ ఆంటీ (Kumari Aunty)..కుమారీ ఆంటీ..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కుమారీ ఆంటీనే దర్శనం ఇస్తుంది. అంతలా ఆమెను వైరల్ చేసారు యూట్యూబర్స్ ..ఎంత బాగా వైరల్ చేసారో..ఇప్పుడు అంతే త్వరగా ఆమెను రోడ్డున పడేలా చేసారు. ఇంతకీ ఎవరు ఈ కుమారి ఆంటీ..? ఈమెకు యూట్యూబర్స్ కు సంబంధం ఏంటి..? అనేది చూద్దాం.

హైదరాబాద్ లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుట్ స్ట్రీట్ (Street Food) లో కుమారి ఆంటీ మధ్యాహ్నం పూట వెజ్, నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తూ ఉంటుంది. ఈమె ఇటీవల ఒక వీడియోతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది. నాన్న మీది రూ.థౌజెండ్ అయ్యింది.. 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పిన వీడియో పెద్దఎత్తున చర్చలకు దారి తీసింది. సినీ స్టార్స్ సైతం ఈమె ఫుడ్ తినేందుకు పోటీ పడడంతో ఇంకేముందు యూట్యూబర్లంతా ఈమె దగ్గరికి వాలిపోయారు..మెను కార్డు నుండి ప్రతిదీ కవర్ చేస్తూ వైరల్ చేసారు. ఈ వీడియోస్ చుసినా జనాలంతా ఈమె దగ్గరికి వాలిపోయారు. ఈమె దగ్గర ఫుడ్ తినానాలంటే కనీసం గంటకు పైగా వెయిట్ చేయాల్సదే..అంటే అర్ధం చేసుకోవాలి..ఈమె దగ్గరికి ఎంతమంది వస్తున్నారో..ఈమె దగ్గర జనాలు చూసి స్టార్ హోటల్స్ సైతం ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా కొంతమంది చేస్తున్న ట్రోల్స్ వైరల్ కావడంతో గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా బిజినెస్ రెండింతలు అయ్యింది. గతంలో 300 ప్లేట్లు అమ్మితే.. ఇప్పుడు ఏకంగా 500 ప్లేట్ల వరకు బిజినెస్ చేస్తోంది. కుమారి ఆంటీ మంత్లీ టర్నోవర్ ఏకంగా రూ.9 లక్షలకు చేరింది అంటూ కొంతమంది యూట్యూబర్లు వీడియోస్ మరింత వైరల్ చేయడం తో..యువత అంతా ఆంటీ దగ్గర బోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు.

ఫలితంగా.. రద్దీ ఎక్కువైపోయి, రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో.. ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జాం అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంకేముంది.. ట్రాఫిక్ జాంకు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేసి షాప్ క్లోజ్ చేయించారు.

ఇక కుమారి ఆంటీ దగ్గర దొరికే ఐటమ్స్ చూస్తే.. వెజ్‌లో.. వైట్‌ రైస్‌, బగారా రైస్‌, లెమన్‌ రైస్‌, టమాటా రైస్‌, గోంగూర రైస్‌, గోబీ రైస్‌, జీరా రైస్‌, పెరుగన్నం ఆంటీ స్పెషల్. ఇక నాన్‌వెజ్‌‌లో చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, లివర్‌ కర్రీ, మటన్‌ కర్రీ, మటన్‌ లివర్‌, బోటీ కర్రీ, తలకాయ కూర, చేపల కూర, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్‌ కర్రీని ఆంటీ దగ్గర చాలా ఫేమస్. మొత్తం మీద యూట్యూబర్లు తమ వ్యూస్ పెంచుకోవడం కోసం ఏకంగా ఇప్పుడు కుమారి ఆంటీ పొట్టకొట్టారు. మరి కుమారి ఆంటీ మళ్లీ తన బిజినెస్ స్టార్ట్ చేస్తుందో..లేదో..? పోలీసులు ఆమెకు పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలి.

Read Also : Noodles Samosa: వెరైటీగా ఉండే నూడుల్స్‌ సమోసా ఎప్పుడైనా ట్రై చేశారా?