Easyjet Flight: అత్యవసర లాండింగ్ చేశారు.. కానీ అంతలోనే ఊహించని షాక్?

ఇటీవల ఎక్కడ చూసినా కూడా విమానాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడంతో విమానాలను అత్యవసర ల్యాండింగ్

  • Written By:
  • Publish Date - April 24, 2023 / 07:50 PM IST

ఇటీవల ఎక్కడ చూసినా కూడా విమానాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడంతో విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలా సందర్భాలలో విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా అలాగే ఒక విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కానీ ఊహించని విధంగా అడ్డంగా బుక్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. తాజాగా ఏప్రిల్ 19వ తేదీన బుధవారం ఈజీజెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన EZY3409 ఫ్లైట్ లివర్ పూల్ నుంచి టర్కీలోని దల్ మాన్ కి బయలుదేరింది.

కాగా ఆ విమానం టేక్ ఆఫ్ అయిన గంట వరకు పరిస్థితులు సజావుగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత అసలు పరిస్థితులు మొదలయ్యాయి. ఆ విమానంలో గంట తర్వాత అసలు రచ్చ మొదలైంది. విమానంలోని ఇద్దరు ప్రయాణికులు ఆ ప్రయాణం అసురక్షితమని భావించి గోలగోల చేయడం మొదలుపెట్టారు. వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలంటూ నానా హంగామా సృష్టించారు. ఈ నేపథ్యంలోనే విమానంలో ఉన్న సిబ్బంది ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా అలాగే గోల గోల చేస్తూ ఉన్నారు. క్యాబిన్ సిబ్బంది సైతం జోక్యం చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు చేయి దాటిపోయాయి.

చేసేదేమీ లేకపోవడంతో వెంటనే పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. విమానంలో రచ్చ రచ్చ చేసిన ఆ ఇద్దరు ప్రయాణికుల గురించి అధికారులకు సమాచారాన్ని అందించాడు పైలెట్. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన మరుక్షణమే పోలీసులు లోపలికి వెళ్లి ఆ ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరో 12 మందిని కూడా అరెస్టు చేశారు. వెంటనే వారిని మరొక విమానంలో యూకే కి తరలించారు. ఇద్దరు ప్రయాణికుల మాత్రం బయటకు వెల్లడించలేదు.