ఈ మధ్య బీర్ ప్రియులకు వరుస షాకులు ఎదురవుతున్నాయి. ఓ పక్క ప్రభుత్వం మద్యం ధరలు పెంచుకుంటూపోతూ షాక్ ఇస్తుంటే..మరోపక్క బీర్ సీసాలలో బల్లులు, కప్పల కళేబరాలు, నాచు ఇలా రాకరకాలవి కనిపిస్తూ మరింత షాక్ ఇస్తున్నాయి. తాజాగా కింగ్ ఫిషర్ బీర్ (Kingfisher Beer) సీసాలో ప్లాస్టిక్ స్పూన్ (Plastic spoon) కనిపించి షాక్ ఇచ్చిన ఘటన వరంగల్ (Warangal) జిల్లాలో చోటుచేసుకుంది.
Stalin : దక్షిణాదికి అన్యాయం.. పార్టీల అధినేతలకు సీఎం స్టాలిన్ లేఖలు
ఓ గ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చిన బంధువులు, మిత్రులు కలసి మద్యం ఆస్వాదిస్తున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ లైట్ బీరు బాటిల్ ఓపెన్ చేయగా, అందులో తెల్లగా తేలుతున్నదేదో కనిపించింది. విచక్షణగా పరిశీలిస్తే సీసాలో సగం విరిగిన ప్లాస్టిక్ స్పూన్ ఉంది. ఇది చూసిన మందుబాబులందరికీ ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇది చూసిన తర్వాత ఇప్పటివరకు తాగినదంతా దిగిందని మాట్లాడుకున్నారు. వెంటనే వారు తాము బీరు కొన్న షాప్‌కు వెళ్లి యజమానిని నిలదీశారు. మొదట్లో ఏం చేయాలో అర్థం కాలేదు. సీసాలో ఉన్న ప్లాస్టిక్ స్పూన్‌ను బయటకు తీసే ప్రయత్నం చేసినా, అది కాస్త చిక్కుముడిగా మారిపోయింది. దీంతో బీరు నింపే సమయంలో కాకుండా, సీసా తయారీ ప్రక్రియలోనే ఈ స్పూన్ పడిపోయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. కంపెనీ వారు కూడా గమనించకుండానే దాన్ని నింపివేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మద్యం షాప్ యజమాని బాధితులను సముదాయిస్తూ పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశాడు.
Posani : ఊపిరి పీల్చుకున్న పోసాని బెయిల్
బాధితులు గట్టిగా నిలదీయడంతో, వైన్ షాప్ యజమాని ఆ బీరు బాటిల్‌ను వెనక్కి తీసుకుని, అదనంగా రెండు బీర్లు ఇచ్చి డీల్ సెట్ చేశాడు. ఒక్క బీరు బాటిల్‌కు రెండు బీర్లు వచ్చేసరికి మందుబాబులు కోపాన్ని మర్చిపోయి సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఈ ఘటనపై వైన్ షాప్ యజమాని ఆ కంపెనీ దృష్టికి తీసుకెళ్లుతానని హామీ ఇచ్చాడు. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా, కంపెనీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.