Woman Commando With PM : ఇప్పుడు ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెంట భద్రత కోసం ఒక మహిళా కమాండో ఉన్నారు. ఈ ఫొటోను ప్రముఖ నటి, బీజేపీ నేత కంగనా రనౌత్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో దీనిపై అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్‌పీజీ) భద్రత కల్పించే టీమ్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెంట మహిళా కమాండోను మోహరించారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే ఈవిషయాన్ని ఎవరూ అధికారికంగా ధ్రువీకరించ లేకపోయారు.
Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘నానా హైరానా’ సాంగ్ వచ్చేసింది..రొమాన్స్ మాములుగా లేవు
ఇక వాస్తవికతలోకి వెళితే.. ఫొటోలో ప్రధాని మోడీ వెంట ఉన్న మహిళా కమాండో(Woman Commando With PM) ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు’నకు చెందినవారే. ఆ ఫొటోను పార్లమెంటు ప్రాంగణంలో తీశారు. పార్లమెంటులోకి వచ్చే మహిళా సందర్శకులను తనిఖీ చేయడానికి ఎస్‌పీజీ మహిళా కమాండోలను మోహరిస్తుంటారు. పార్లమెంటు గేట్ల వద్ద, ప్రాంగణంలో ఉన్న చెక్ పాయింట్ల వద్ద వీరి సేవలను వినియోగించుకుంటారు. ఎస్‌పీజీలో భాగంగా ఉండే క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ (CPT)లోకి 2015 సంవత్సరం నుంచి మహిళలను చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్పీజీలో దాదాపు 100 మంది మహిళా కమాండోలు ఉన్నట్లు సమాచారం. తనిఖీ విధులు, బందోబస్తు విధులు, భద్రతా విధులు అన్నింటినీ చేయగల సామర్థ్యం వారి సొంతం.
Also Read :Black Friday Sale In India: విమానంలో ప్రయాణించే వారికి శుభవార్త.. రూ. 50 లక్షల ఉచిత ప్రయాణ బీమా!
1985లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రధానమంత్రి, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తుంటుంది. SPG అధికారులు నాయకత్వం, వృత్తి నైపుణ్యం, భద్రతా నైపుణ్యాలలో ప్రత్యేక శిక్షణ పొందుతారు. వీరు సెక్యూరిటీ కల్పించేందుకు వినూత్న విధానాలను అవలంభిస్తారు. ఎస్‌పీజీ విభాగం నేరుగా భారత ఇంటెలీజెన్స్ బ్యూరో, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ తమకు కేటాయించిన సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తుంది.