DL1 CJI 0001 : సీజేఐ చంద్రచూడ్ కారు నంబర్ వైరల్.. ఎందుకు ?

DL1 CJI 0001 : భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ వాడే మెర్సిడెజ్ బెంజ్ కారుకు సంబంధించిన నంబర్ ప్లేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Written By:
  • Updated On - February 19, 2024 / 09:13 AM IST

DL1 CJI 0001 : భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ వాడే మెర్సిడెజ్ బెంజ్ కారుకు సంబంధించిన నంబర్ ప్లేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా న్యాయమూర్తులు ప్రైవేట్ ఫంక్షన్లలో కనిపించడం చాలా అరుదు. వారి వ్యక్తిగత వివరాలు చాలా, వ్యక్తిగత కార్యక్రమాల సమాచారం గోప్యంగా ఉంటుంది. ప్రత్యేకించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాడే వాహనాలు ఏవో కూడా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా జాగ్రత్తపడతారు. అయితే సీజేఐ డీవై చంద్రచూడ్ వాడే కారు ఓ ట్వీట్ కారణంగా  ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ ఏమిటా ట్వీట్.. ? అందులో ఏముంది ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

లాయిడ్ మథియాస్ అనే వ్యాపారవేత్త తన ట్విట్టర్ హ్యాండిల్‌లో సీజేఐ డీవై చంద్రచూడ్ కారు ఫొటోను షేర్ చేశారు. ఆ కారు నంబర్ ప్లేటుపై DL1 CJI 0001 అని ఉంది. ఈ విషయాన్ని  లాయిడ్ మథియాస్ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. “సీజేఐ చంద్రచూడ్‌‌ను నిన్న ఢిల్లీలో జరిగిన ఓ ఫంక్షన్‌‌లో చూశాను. నేను బయటకు వెళ్తున్నప్పుడు ఆయన కారు కనిపించింది. దాని లైసెన్స్ ప్లేట్ నెంబర్ DL1 CJI 0001 (DL1 CJI 0001) అని ఉంది. వెరీ కూల్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కారు నంబర్ ప్లేట్ DL1 CEC 0001 అని ఉంటుందా?” అని సరదాగా రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ కారు మెర్సీడెజ్ E 350 D మోడల్‌ది అని వెల్లడైంది. ఈ కారు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పేరిట ఉంది. అంటే ఈ కారును కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాన న్యాయమూర్తికి ఇస్తుందనే విషయం క్లియర్ అయింది. సీజేఐ డీవై చంద్రచూడ్ వాడుతున్న మెర్సీడెజ్ E 350 D మోడల్‌ కారు ధర దాదాపు రూ.88.96 లక్షలు ఉంటుంది. ఈ కారుకు ఆటోమేటిక్ (TC) ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. అబ్సీడియన్ బ్లాక్ మెటల్లిక్, గ్రాఫైట్ గ్రే, హై టెక్ సిల్వర్ మెటల్లిక్, పోలార్ వైట్ అనే నాలుగు రంగుల్లో ఇది లభిస్తోంది.

Also Read : Skill Development Courses : 100 డిగ్రీ కాలేజీల స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఇక 100 ‘స్కిల్’ కోర్సులు

ఈ కారు నంబర్ ప్లేటుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు. నవంబర్ 24న సీజేఐ చంద్రచూడ్ రిటైర్ అయ్యాక, ఈ కారు నంబర్ DL 1X CJI 001 అవుతుందేమో అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అది ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ అని మరొకరు రియాక్ట్ అయ్యారు. ఈ ప్రివిలేజ్ ఒక్క సుప్రీంకోర్టుకు మాత్రమే అని ఇంకో యూజర్ చెప్పుకొచ్చారు.

Also Read :Inter Hall Tickets : నేటి నుంచే ‘ఇంటర్’ హాల్‌టికెట్స్ రిలీజ్.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదీ