Site icon HashtagU Telugu

Romantic Photo Shoot Of Teacher : పదో తరగతి స్టూడెంట్ తో ప్రిన్సిపల్ రొమాన్స్..

Romantic Photo Shoot Of Tea

Romantic Photo Shoot Of Tea

సమాజం (Society) ఎటు పోతుందో అర్ధం కావడం లేదు..టెక్నలాజి పుణ్యమో..లేక సినిమాల ప్రభావమో తెలియదు కానీ ప్రేమ (Love) పేరుతో విచ్చలవిడి చేస్తున్నారు. ప్రేమకు కులం , మతం , వయసు తో సంబంధం లేదంటారని చెప్పి..మరి ఇంత భరితెగిస్తే ఎలా..? ఇటీవల కాలంలో చాలామంది వావివరుసలు మరచిపోతున్నారు..పెద్ద , చిన్న అనేది చూడడంలేదు..సమాజం ఏమనుకుంటుందో..అనేది మరచిపోయారు..పబ్లిక్ గా బరితెగిస్తున్నారు. సామాన్య ప్రజలే కాదు విద్యార్థులకు ఉన్నత బుద్ధులు నేర్పించాల్సిన గురువులే (Teachers) తప్పులు చేస్తున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు..వారితో ప్రేమాయణం..కామకోర్కెలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి రాగా..తాజాగా పదో తరగతి స్టూడెంట్ తో స్కూల్ ప్రిన్సిపల్ రొమాన్స్ చేయడం..అది కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటన కర్ణాటక (Karnataka )లోని మురుగమల్లా (Murugamalla) గ్రామంలో చోటుచేసుకుంది. విద్యార్థులతో టూర్ కు వెళ్లిన సదరు మహిళా ప్రిన్సిపల్..పదో తరగతివిద్యార్థితో రొమాంటిక్ మూడ్ లో కనిపించింది. అక్కడితో ఆగకుండా వాటిని కెమెరా లలో షూట్ చేయించింది. ఈ ఫొటోస్ లలో ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోస్ బయటకు రావడంతో స్టూడెంట్ తల్లిదండ్రులు సదరు ప్రిన్సిపల్ ఫై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయగా.. ప్రధానోపాధ్యాయురాలి తీరుపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయిరాలిని సస్పెండ్ చేశారు.

Read Also : January 1st – 4 Rules : న్యూ ఇయర్ 2024లో.. 4 న్యూ రూల్స్