video viral: వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న జంట.. వీడియో వైరల్?

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ

Published By: HashtagU Telugu Desk
Video Viral

Video Viral

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలు గీటమునిగాయి. ఇల్లులు కొట్టుకుపోయాయి. గ్రామాలన్నీ కూడా జలమయమయ్యాయి. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణం నష్టం కూడా సంభవించింది. దీంతో తప్పనిసరి పరిస్థితులలో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున వరద నీరు నిలిచి ఉంటున్నాయి.

దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక కొత్త జంట ఏకంగా వరద నీటిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అసలు ఏమైంది అన్న వివరాల్లోకి వెళితే.. డొక్సురి తుపాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ వరద నీటిలోనే ఒక జంట వివాహం చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక చర్చిలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాదాపు అడుగుమేర నీటిలో వధువు నడుచుకుంటూ వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు. ముందుగా నిశ్చయించుకున్న ప్రకారమే పెళ్లి జరగాలని వధువు పట్టుబట్టడంతో.. ఆ వరద నీటిలోనే వివాహం జరిపించినట్లు వధువు తల్లిదండ్రులు తెలిపారు.

ఆ వీడియోలో వధువు ఆ వరద నీటిలోని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి పక్కనే ఉన్న మహిళకు హాగ్ ఇవ్వడంతో పాటు కాబోయే భర్తకు హగ్ ఇచ్చి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

  Last Updated: 02 Aug 2023, 04:25 PM IST