Site icon HashtagU Telugu

Bihar : కదులుతున్న రైలు నుంచి మొబైల్ దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిన దొంగ

Passengers Catch Mobile Thi

Passengers Catch Mobile Thi

ఒకప్పుడు దొంగలు అంటే..ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి డబ్బు , నగలు , బట్టలు ఎత్తుకెళ్లేవారు..కానీ ఇప్పుడు దొంగలు కదులుతున్న రైలు నుండి మొబైల్స్ దొంగతనం చేయడం చేస్తున్నారు. కొంతమంది మెట్ల ఫై కుర్చీని ఫోన్ మాట్లాడుతుండడం..లేదా విండో సీట్లో కుర్చీని పాటలు వినడం చేస్తుంటారు. వీనిని దొంగలు టార్గెట్ గా చేసుకొని కదులుతున్న ట్రైన్ లో నుండి వారి నుండి ఫోన్ లు దొంగతనాలు చేస్తున్నారు.

ప్రతి రోజు ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్ లోను ఇలాగే చేయబోయిన దొంగ అడ్డంగా దొరికాడు. బీహార్‌లోని భగల్‌పుర్ సమీపంలో కదులుతున్న ట్రైన్ లో ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతుండగా..ఓ యువకుడు ఆ ఫోన్ ను లాక్కున్నాడు..అదే సందర్భంలో ఫోన్ యజమాని ఆ దొంగను గట్టిగా పట్టుకున్నాడు. పక్కనున్న ప్రయాణికులు సైతం ఆ దొంగను గట్టిగా పట్ట్టుకొని కొట్టడం స్టార్ట్ చేసారు. ఇలా కిలోమీటర్ పాటు కొట్టుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.