Marriage in Old Age: ప్రేమకు కుల, మత, ప్రాంత భేదాలు ఉండవని ఎన్నో జంటలు నీరుపించాయి. ఇక ఈ మధ్య కాలంలో తాము ప్రేమించిన యువకుడి కోసం హద్దులు దాటే ప్రేమికులను మనం చూశాం. అయితే వీటన్నింటికంటే ఈ ప్రేమ చాలా ప్రత్యేకమైనది. కెనడాకు చెందిన 70 ఏళ్ల బామ్మ 35 ఏళ్ల పాకిస్థానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ వార్తతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఈ పెళ్లిపై చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కేవలం కెనడా వీసా కోసమే ఈ పని చేశాడని, అంటే పేదరికంలో ఉన్నందుకే పెళ్లి చేసుకున్నాడని భావిస్తున్నారు. మరి ఈ వింత ప్రేమ వివాహానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పెళ్ళికొడుకు పేరు నయీమ్ షాజాద్ (35) పాకిస్థాన్ కుర్రాడు. ఆమె పేరు మేరీ (70) కెనడా బామ్మ. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు.. 2012లో నయీమ్ షాజాద్ ఫేస్‌బుక్‌లో కలుసుకున్నారు. అలా వారి మధ్య పరిచయం పెరిగింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో మేరీ 2015లో అతడికి ప్రపోజ్ చేసింది. షాజాద్ కూడా ఆమె ప్రపోజల్‌కు అంగీకరించి 2017లో పెళ్లి చేసుకున్నారు.కానీ వీసా సమస్య కారణంగా ఇద్దరూ కెనడాలో కలిసి జీవించలేకపోయారు. ఇటీవల, మేరీ పాకిస్తాన్‌ను సందర్శించి అతనితో 6 నెలలు గడిపింది.
షాజాద్ గతంలో ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయాడు. అప్పుడు మేరీ షాజాద్‌కు అండగా నిలిచింది. ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా మానసిక ధైర్యాన్ని కూడా అందించింది.మేరీ అస్సలు ధనవంతురాలు కాదు. పింఛన్‌తో ఆమె జీవిస్తోంది. ఇంత ఘాటైన ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: AP : విజయసాయిరెడ్డి రివర్స్ అటాక్..టీడీపీ నేతల వల్లే చంద్రబాబు కు హాని