Site icon HashtagU Telugu

Pakistan: రాత్రి 8 తర్వాత పిల్లలు పుట్టరు అంటోన్న పాక్ మంత్రి… నెటిజన్లు ఫైర్!

Photo 1597543177355 E874cee9dee8

Photo 1597543177355 E874cee9dee8

Pakistan: పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ మంతా మారుమోగుతున్నాయి. పాక్ సర్కార్ తాజాగా కొత్త ఇంధన సంరక్షణ ప్రణాళికను ఆమోదించింది. దాని ప్రకారంగా చూస్తే ఇకపైన రాత్రి 8 గంటల తర్వాత దేశంలోని అన్ని మార్కెట్లు, మాల్స్ మూసివేయబడతాయని తెలిపింది. ఆ టైంలో అత్యధిక విద్యుత్ వినియోగమయ్యే పరికరాల వాడకాన్ని కూడా నిషేధించినట్లు వెల్లడించింది. ఇలా చేయడం వల్ల పాక్ దేశానికి ఏడాదికి 62 బిలియన్ రూపాయలు ఆదా కానున్నట్లు సమాచారం.

పాక్ వాతావరణ శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్, ఇంధన శాఖ మంత్రి ఖుర్రం దస్తగీర్ ఖాన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్‌ మొదలైనవారు ఈ క్యాబినెట్ నిర్ణయాన్నీ తీసుకుని ప్రకటించారు. రాత్రి 8 గంటల తర్వాత విద్యుత్ లేని ప్రాంతాల్లో జనాభా తగ్గుదల ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలుపడంతో ఇప్పుడంతా దాని గురించే చర్చించుకుంటున్నారు.

ప్రణాళిక ప్రకారం కళ్యాణ మండపాలు రాత్రి 10 గంటలకు, మార్కెట్లు రాత్రి 8:30 గంటలకు మూతపడాలని ఆయన సూచించారు. ఈ మార్గదర్శకాల అమలుతో దేశానికి రూ.62 వేలకోట్లు ఆదా అవుతుందని తెలిపారు. కాగా మంత్రి మాట్లాడిన తీరు ఇప్పుడు విమర్శల పాలు చేస్తోంది.

ప్రముఖ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ పాక్ మంత్రిపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి విడ్డూరమైన పరిశోధన ఎక్కడా జరిగి ఉండదని, రాత్రి 8 గంటల తర్వాత కరెంటు లేకుంటే పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారని ఆయన ఘాటుగానే కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.