Site icon HashtagU Telugu

PAK vs AUS 2nd Test: లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన అంపైర్

PAK vs AUS

PAK vs AUS

PAK vs AUS 2nd Test: క్రికెట్ మైదానంలో ఆడుతున్నప్పుడు సమస్యలు సహజం. ఒక్కోసారి చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి పలు ఆటంకాల కారణంగా మ్యాచ్ నిలిపివేస్తారు. అయితే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ రెండో టెస్టు సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.

లంచ్ ముగించుకుని ఆటగాళ్లు, ఫీల్డ్ అంపైర్లు గ్రౌండ్ లోకి వచ్చారు. కానీ థర్డ్ అంపైర్ రిచర్డ్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. రిచర్డ్ పరిస్థితిని చూస్తూ ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నవ్వు ఆపుకోలేకపోయాడు.కొన్ని నిమిషాల తర్వాత రిచర్డ్ బయటకిరావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కెమెరామెన్ థర్డ్ అంపైర్ వైపే ఫోకస్ చేయడంతో తాను తిరిగొచ్చానంటూ చేయి ఊపాడు. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారడంతో క్రికెట్ ఫాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: CM Revanth Reddy: దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: సీఎం రేవంత్ రెడ్డి