Owaisi Hospital Incident: బిల్లు కట్టలేక పసికందును ఆస్పత్రిలోనే వదిలేసిన తల్లిదండ్రులు

  • Written By:
  • Updated On - September 20, 2023 / 01:12 PM IST

ప్రస్తుతం రోగం వచ్చిదంటే అది తగ్గుతుందా..లేదా అనే భయం కంటే..హాస్పటల్ (Private Hospital) వారు ఎంత డబ్బు వసూళ్లు చేస్తారో అనే భయం అందరిలో ఎక్కువ అవుతుంది. కాలి నొప్పి అని హాస్పటల్ కు వెళ్తే..కాలు తీసేయాల్సి వస్తుందేమో అనే భయం పుట్టించి అన్ని టెస్టులు చేసి..వేల బిల్లు వేసి..చివరకు రూ. 2 ల పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపుతున్న రోజులు ఇవి. అందుకే ప్రవైట్ హాస్పటల్ అంటే వామ్మో అనాల్సిన వస్తుంది. పోనీ ప్రభుత్వ హాస్పటల్ కు పోదామా..అంటే అక్కడ ఎవరు డాక్టరో..ఎవరో నర్సో అర్ధం కాదు..ఆపరేషన్లు చేసి కడుపులోనే కత్తులు మరచిపోతున్నారు..ఏదో ఒకటి అని అక్కడికి వెళ్తే పోయే టైంకు డాక్టర్స్ ఉండరు..భోజనానికి వెళ్లాడని..వస్తాడో రాడో అనే సమాదానాలు చెపుతుంటారు. దీంతో చేసేదేం లేక చివరకు ప్రవైట్ హాస్పటల్ కే వెళ్లి..ఉన్న డబ్బు వదిలించుకొని వస్తారు.

తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. బిల్లు కట్టలేక తల్లిందండ్రులు పసికందును ఆస్పత్రిలోనే వదిలేసి వచ్చిన ఘటన సైదాబాద్ సింగరేణి కాలనీ లో చోటుచేసుకుంది. ఐఎస్ సదన్ (IS Sadan) డివిజన్ సింగరేణి కాలనీ రోడ్ నంబర్ 14కు చెందిన నితిన్, రవళిక ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. కూలీ పని చేసుకుని జీవిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన వారికి పండండి పాప జన్మించింది. దీంతో తమ ఇంట లక్ష్మీ జన్మించిందని సంతోష పడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. కాసేపటికే ఆ పాప అనారోగ్యానికి గురైంది. దీంతో నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్ ద్వారా వైద్య చికిత్స అందజేశారు. హెల్త్ కండీషన్ మెరుగుపడ్డాక ఇంటికి వచ్చారు.

Read Also : Megastar Tribute: భారతీయ సినీ చరిత్ర లోనే నాగేశ్వర్ రావు ఓ దిగ్గజ నటుడు: చిరంజీవి

ఇంటికి వచ్చిన తర్వాత మరోసారి పాప అనారోగ్యానికి గురైంది. పాప శరీరంలో మార్పు రావడం తో వెంటనే స్థానిక వైద్యుడిని (doctor) సంప్రదించారు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో.. ఒవైసి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ జరిగి.. పాప కోలుకుంది. ఐదురోజుల క్రితం డిశ్చార్జ్ కూడా చేశారు. కానీ బిల్లు (bill) రూ.1.16 లక్షలు వేశారు. ఆ బిల్లు చూసి షాక్ అయ్యారు. కూడబెట్టిన మొత్తం రూ.35 వేలు చెల్లించారు. మిగతా డబ్బు సర్దుబాటు చేస్తామని చెప్పి, ఇంటికి వచ్చేశారు. ఎక్కడ డబ్బు దొరకలేదు.. కూలీ నాలీ పనులు చేసుకునే వారికి అంత మొత్తం ఇచ్చేవారు లేకుండా పోయారు. దీంతో ఆ పాప హాస్పటల్ లోనే ఉంది..చిన్నారిని తీసుకురాలేక, ఇంటి వద్ద ఉండలేక ఆ తల్లిదండ్రులు చిత్రవధ అనుభవిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం తో..తమ గోడును వెళ్లబోసుకుంటూ.. మనస్సున్న మరాజులు ఎవరైనా బిల్లు కట్టి తమ పాపను ఇచ్చేయాలని కోరుతున్నారు. మరి ఈ ఘటన ఫై ప్రభుత్వమైనా స్పందిస్తుందేమో చూడాలి.