Toddler Bites Snake: పాముని నోట్లోకి తీసుకుని నమిలిన ఏడాది పాప

గయా జిల్లాలోని జముహర్ గ్రామంలో రాకేష్ కుమార్ ఏడాది వయసున్న కుమార్తె ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటున్న సమయంలో పాము వచ్చింది. అయితే అది బొమ్మ అనుకున్న ఆ చిన్నారి పామును చేత పట్టుకుని నోట్లో పెట్టుకుంది.

Published By: HashtagU Telugu Desk
Toddler Bites Snake

Toddler Bites Snake

Toddler Bites Snake: బీహార్‌లోని గయాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాది వయసున్న చిన్నారి పామును నమిలి వార్తల్లోకెక్కింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన ఆగస్టు 17న జరిగినట్లు చెబుతున్నారు.

గయా జిల్లాలోని జముహర్ గ్రామంలో రాకేష్ కుమార్ ఏడాది వయసున్న కుమార్తె ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటున్న సమయంలో పాము వచ్చింది. అయితే అది బొమ్మ అనుకున్న ఆ చిన్నారి పామును చేత పట్టుకుని నోట్లో పెట్టుకుంది. వాస్తవానికి దాన్ని తెలియా పాము అని పిలుస్తారు. ఇది వర్షాకాలంలో బయటకు వస్తుంది. పామును నోటిలోకి తీసుకొని కోరుకుతుండగా చిన్నారి తల్లి గమనించి వెంటనే పామును లాగేసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని ఫతేపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

చిన్నారికి వైద్య పరీక్షలు చేయగా, చిన్నారి పూర్తిగా ఆరోగ్యంగా ఉందని తెలిపారు. అయితే పాము విషపూరితమైనది కాదని డాక్టర్లు చెప్పారు. ఇది కేవలం వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తుందని స్థానికులు చెప్తున్నారు. చిన్నారికి ప్రాణాపాయం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు గుమిగూడారు. అందరూ తమ మొబైల్‌లో చనిపోయిన పామును వీడియోలు తీశారు.

Also Read: MLC: ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణం

  Last Updated: 21 Aug 2024, 05:24 PM IST