Site icon HashtagU Telugu

Raksha Bandhan : తమ్ముడంటే ఎంత ప్రేమ..రాఖీ కట్టేందుకు కాలినడకన 8 కిమీ నడిచిన 80 ఏళ్ల వృద్ధురాలు

Old Woman Walks 8 KM without Slippers To Tie Rakhi To His Brother

Old Woman Walks 8 KM without Slippers To Tie Rakhi To His Brother

రాఖీ పండగ (Raksha Bandhan)కు నిజమైన నిర్వచనం ఇచ్చింది ఈ 80 ఏళ్ల వృద్ధురాలు (80 Years Old Woman). తన తోడబుట్టిన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 8 కిమీ లు అది కూడా కాలికి చెప్పులు లేకుండా నడిచి వెళ్లి తన ప్రేమను పంచింది. ఇలాంటి వారు ఉన్నారు కాబట్టే ఇంకా బంధాలు , అనుబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుత సమాజంలో ఈర్ష , ద్వేషాలు పెరిగిపోయాయి. సొంత తోబుట్టువులనే ఓర్వలేని రోజులు వచ్చాయి. సొంత అన్న బాగుపడిన..తమ్ముడు బాగుపడిన..అక్క చెల్లెల్లు బాగుపడిన చూసి ఓర్వలేని మనుషులు తయారయ్యారు. పైపైకి ప్రేమలు చూపిస్తున్న అవన్నీ కూడా గొంతులోనుండి వచ్చేవే తప్ప హృదయాలను వచ్చేవి కావు.

Read Also : Raksha Bandhan : ఆ 60 గ్రామాలు ‘రక్షా బంధన్’ కు దూరం..ఎందుకో తెలుసా..?

ఇక రాఖీ పండగ వచ్చిదంటే ఒకప్పుడు తన తోబుట్టువుకు రాఖీ కట్టాలని ఎంతో ప్రేమగా ఎదురుచూసేవారు..కానీ ఇప్పుడు మాత్రం రాఖీ కడితే మా అన్న ఎంత ఇస్తాడో..మా తమ్ముడు ఏం పెడతాడో..పోయినేడాది కడితే నాకు ఏం పెట్టాలె..ఈసారి రాఖీ కట్టాను..ఇలా అనుకుంటున్నారు. ఇలాంటి ఈ మనుషుల మధ్య తన తోడబుట్టిన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 8 కిమీ లు అది కూడా కాలికి చెప్పులు లేకుండా 80 ఏళ్ల వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్లి రాఖీ కట్టి నిజమైన ప్రేమ అంటే ఇది అని అంత మాట్లాడుకునేలా చేసింది. మరి ఈ అవ్వ గురించి మనం కూడా తెలుసుకుందాం.

జగిత్యాల జిల్లా (Jagtial district) మల్యాల మండలం కొత్తపల్లి (kottapalli)కి చెందిన బక్కవ్వ (80 ఏళ్లు) కరీంనగర్ (Karimnagar ) జిల్లా గంగాధర మండలంలోని కొండయ్యపల్లి (kondayya pally)లో ఉంటున్న తన తమ్మునికి రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు (Old Woman Walks 8 KM without Slippers To Tie Rakhi To His Brother) నడుచుకుంటూ వెళ్లింది. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 8 కి. మీ. మేర నడిచి వెళ్లింది. కాలినడకన వెళ్తున్న వృద్ధురాలని ఓ యువకుడు ఆపి వివరాలు కనుక్కొని ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రశ్నించగా తన తమ్ముడికి రాఖీ (Rakhi) కట్టేందుకు వెళ్తున్నానని బదలిచ్చింది. నడిచే వెళ్తావా అంటే అవును నడిచే వెళ్తానని సమాధానం ఇచ్చింది. శరీరంలో సత్తువ చచ్చినా గానీ.. తన తమ్ముడిపై ప్రేమ మాత్రం చావలేదని నిరూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో చాలామంది నెటిజనులు కామెంట్స్ చేస్తూ..తెగ షేర్ చేస్తున్నారు.