Viral Video: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చాచాజీ లుంగీ డ్యాన్స్

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీది వైరల్ అవుతుంది. మారుమూల ప్రాంతంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ కూడా క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీది వైరల్ అవుతుంది. మారుమూల ప్రాంతంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ కూడా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇలా వైరల్ అయిన వీడియోలో కనిపించిన ఎందరో ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఓ పెద్దాయన వేసిన డ్యాన్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వ్యక్తి పెళ్లిలో లుంగీ డ్యాన్స్ పాటపై సందడి చేశాడు. అతని స్టైల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే లుంగీ డాన్స్ కి తలైవా అంకుల్ అనే బిరుదు కూడా ఇచ్చాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏదో పెళ్లి లేదా ఫంక్షన్‌కి సంబంధించినది. షారుఖ్ ఖాన్ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని ‘లుంగీ డాన్స్’ పాట ప్లే చేయడం ప్రారంభించినప్పుడు అందరూ DJ ఫ్లోర్‌పై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఈ పాట విన్న ఒక పెద్దాయన వెంటనే స్టేజ్ పైకి ఎగిరి తన లుంగీని చూపిస్తూ లుంగీ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు.స్టేజీ మొత్తాన్ని ఆక్రమిస్తూ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేసాయడం అందర్నీ ఆకట్టుకుంది.ఈ వీడియోని పప్పులన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు లక్షల మంది ఈ వీడియోను చూడగా, లక్షల మంది లైక్ చేశారు. చాలా మంది వినియోగదారులు దీనిపై ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదే నిజమైన లుంగీ డ్యాన్స్ అంటున్నారు.

Also Read: Dusharla Satyanarayana : తెలంగాణ ప్రకృతి ప్రేమికుడికి అరుదైన గౌరవం.. ‘గ్రీన్ హార్ట్ దుశర్ల సత్యనారాయణ’ స్క్రీనింగ్