Noahs Ark : ‘నూహ్ ఓడ’ ఇదేనా ? టర్కీలో అగ్నిపర్వతం వద్ద చారిత్రక శిలాజం !

Noahs Ark : నూహ్ (నోహ్) ఓడ.. దీనికి సంబంధించిన పురాణ గాథ గురించి ఇస్లాం, క్రైస్తవ, జుడాయిజం పవిత్ర గ్రంథాలలో ప్రస్తావన ఉంది.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 02:03 PM IST

Noahs Ark : నూహ్ (నోహ్) ఓడ.. దీనికి సంబంధించిన పురాణ గాథ గురించి ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజం పవిత్ర గ్రంథాలలో ప్రస్తావన ఉంది. నూహ్ అనే దైవ ప్రవక్త ఒక ఓడను నిర్మించడంతో ఆ కథ ముడిపడి ఉంటుంది. దాదాపు 5వేల సంవత్సరాల క్రితం జల ప్రళయం నుంచి తన ప్రాంత ప్రజలను రక్షించడానికి  నూహ్ ప్రవక్త ఒక ఓడను నిర్మించారని పురాణ గాథల్లో ఉంది. తాజాగా టర్కీ, అమెరికా పురావస్తు శాస్త్రవేత్తలతో కూడిన ‘నూహ్స్ ఆర్క్ రీసెర్చ్ టీమ్’.. నూహ్ ఓడ గురించి పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించిన వర్ణనలతో పోలిన ఒక ప్రదేశాన్ని గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

టర్కీ తూర్పు ప్రాంతంలో 16,500 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ అరారత్ అగ్నిపర్వతం  సమీపంలో అచ్చం ఓడలాంటి ఆకారంతో కూడిన శిలాజం సైంటిస్టులకు లభ్యమైంది. ఈ ప్రదేశంలో లభ్యమైన శిలాజాలను బట్టి..  అప్పట్లోనే బంకమన్ను, నౌకల తయారీ సామగ్రి,  సముద్ర ఆహారం  అందుబాటులో ఉన్నాయని తెలుస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మౌంట్ అరారత్‌ సమీపంలోని ఓ ప్రదేశంలో తవ్వకాలు జరుపుతుండగా.. అచ్చం ఓడ ఆకారంలో ఉన్న ఈ  ప్రదేశం బయటపడిందని చెప్పారు. ఇరాన్-టర్కీ బార్డర్ నుంచి 2 మైళ్ల దూరంలోని ఆగ్రీలో ఉన్న డోగుబయాజిట్ జిల్లాలో ఈ ప్రదేశం  ఉందని వివరించారు. ఈ ప్రదేశంలో నౌక తరహా ఆకారం దాదాపు 538 అడుగుల మేర విస్తరించి ఉందని చెప్పారు.

Also Read: JioPhone: ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. రూ.2,599కే 4G ఫోన్..!