Site icon HashtagU Telugu

No Rain Village : ఆ గ్రామంలో వర్షం అనేది పడదట..

Al Hutaib Village

Al Hutaib Village

ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఎన్నో వేల జీవరాసులు బ్రతుకుతున్నాయి. అంతుచిక్కని మిస్టరీస్‌ ఎన్నో ఉన్నాయి.. ఓ చోట విపరీతమైన ఎండలు .. మరోచోట తట్టుకోలేని చలి మరోచోట ఎడతెరిపి లేని వర్షాలు ..ఇలా ఎన్నో విచిత్రాలు. అయితే ఓ గ్రామంలో మాత్రం వర్షం అనేది పడదట (No Rain Village)..అసలు వర్షం ఎలా ఉంటుందో కూడా వారికీ తెలియదట. అక్కడ వర్షం..ఇక్కడ వర్షం అని మాట్లాడుకోవడమే తప్ప మనదగ్గర వర్షం అనేది వారు ఎప్పుడు మాట్లాడుకోరట. ఇంతకీ ఎక్కడ ఆ వర్షం పడని గ్రామం అంటారా..?యెమెన్‌ రాజధాని సనాకు పశ్చిమ దిశలో అల్‌ హుతైబ్‌ ( Al -hutaib ) అనే గ్రామం.

ఇక్కడ వర్షం (Rain ) కురవక పోయినా జనాలు హాయిగా జీవిస్తారు. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామంలో వాతావరణం వేడిగా ఉంటుంది. శీతా కాలంలో ఉదయం చల్లగా, మధ్యాహ్నం వేడిగానూ ఉంటుంది. ఇక్కడి పరిస్థితులు ఆ గ్రామ ప్రజలకు అలవాటే. ఈ వింత ప్రదేశానికి వచ్చేందుకు పర్యాటకులు క్యూ కడతారు. ఈ గ్రామంలో పాత కాలపు నిర్మాణలతో పాటు.. కొత్త నిర్మాణాలు కూడా దర్శనమిస్తాయి. ఎప్పుడూ వర్షం పడకపోవటానికి కారణం ఈ గ్రామం మేఘాలకు మించి ఎత్తులో ఉండడమే.

అంటే.. ఈ గ్రామంలో మేఘాలు మన కాళ్ల కింద ఉంటాయి. వీటిని ఈజీగా చేతులతో తాకొచ్చు. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు. వర్షాలు పడకపోవడం ఒక్కటే కాదు అల్‌ హుతైబ్‌ గ్రామంలో వాతావరణం పూర్తిగా డిఫరెంట్‌గానే ఉంటుంది. ఉదయం సూర్యుడు ఉదయించేంత వరకు ఈ గ్రామాన్ని చలి కప్పేస్తుంది. సూర్యుడు ఉదయించగానే ఎండలు మండిపోతాయి. మళ్లీ సూర్యుడు అస్తమించగానే ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతాయి.

ఈ గ్రామంలో అల్‌ బోహ్రా ( అల్‌ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా నివశిస్తుంటారు. వీరిని యెమెన్‌ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. వీళ్లు మన ముంబై నుంచి వెళ్లినవాళ్లే. ముంబైకి చెందిన మహమ్మద్‌ బుర్హానుద్దీన్‌ నేతృత్వంలోని ఇస్మాయిలీ విభాగం నుంచి వచ్చి అల్‌ హుతైబ్‌లో స్థిరపడ్డారు. మరి వీరికి నీటి సమస్య లేదా అని అనుకోవచ్చు. వీరికే కాదు యెమెన్‌లో నీటి సమస్య ఎక్కువే. పైగా సనాలో అది మరీ ఎక్కువ. అందుకే సనా మున్సిపల్, వాటర్‌ కార్పొరేషన్‌ నీటి సమస్య తీర్చడానికి 2007లో కొత్త పద్ధతులు ఎంచుకుంది. మొబైల్‌ వాటర్‌ ట్యాంకర్లతో సిటీ మొత్తం వాటర్‌ సరఫరా చేస్తోంది. ఈ ఎత్తైన అల్‌ హుతైబ్‌ గ్రామానికి కూడా మొబైల్‌ ట్యాంకులతో పాటు, పైపులతో నీళ్లను అందిస్తుంటారు.

Read Also : Anasuya bharadwaj : హై పీక్స్‌లో అనసూయ ఓపెన్ గ్లామర్ షో..