Site icon HashtagU Telugu

Nithyananda : నిత్యానంద స్వామి కన్నుమూత..?

Nithyananda Swami

Nithyananda Swami

స్వయంప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి (Nithyananda ) మరణించినట్లు వార్తలు (Death News ) వైరల్ గా మారాయి. వివాదాస్పద జీవితాన్ని గడిపిన నిత్యానంద రెండు రోజుల క్రితం మృతి చెందారని ఆయన సోదరి కుమారుడు సుందరేశ్వరన్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. హిందూ ధర్మం కోసం జీవితాంతం పాటుపడ్డారంటూ ఆయన స్మరణ చేశారు. నిత్యానంద తన ఆధ్యాత్మిక సందేశాలతో ఎంతటి భక్తుల అభిమానాన్ని సంపాదించుకున్నారో, అంతే స్థాయిలో వివాదాల్లో చిక్కుకుని దేశం విడిచి వెళ్లిపోయారు.

Ghibli Images: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గిబ్లీ స్టైల్ ఫోటోలు కావాలా? ఈ సులువైన స్టెప్స్ వాడి సులభంగా పొందండి

నిత్యానంద స్వామి తమిళనాడులోని తిరువన్నామలై లో జన్మించారు. ఆ తర్వాత కర్ణాటకలోని బీదర్ కు మకాం మార్చారు. 2019లో భారత్ నుంచి పారిపోయిన అనంతరం తానే ఓ కొత్త దేశాన్ని సృష్టించానని ప్రకటించారు. దానికి “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” అని పేరు పెట్టారు. అయితే ఈ దేశం ఎక్కడ ఉందనే విషయంలో స్పష్టత లేదు. కొందరు ఇది ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపం అంటుండగా, మరికొందరు ఇది నిత్యానంద కల్పితం మాత్రమే అంటున్నారు. అంతర్జాతీయంగా ఏ దేశమూ, ఏ సంస్థ గానీ కైలాసాన్ని గుర్తించలేదు.

Yogi Adityanath : దీని కారణంగా మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా? లేదు కదా..!: యోగి

నిత్యానంద అనుచరులు 2023లో ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరై, హిందూ వ్యతిరేక శక్తులు తమను వేధిస్తున్నాయని ఆరోపించారు. అయితే ఆ సమావేశం ఓ పబ్లిక్ ఈవెంట్ మాత్రమేనని, ఇది కైలాసానికి గుర్తింపు అని భావించరాదని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వివాదాల్లో ఉంటూ వార్తల్లో నిలిచిన నిత్యానంద, తన చివరి రోజులు ఎక్కడ గడిపారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పుడు ఆయన మరణ వార్తలు నిజమేనా? లేదా మరొక వివాదాస్పద ప్రచారమా? అన్నది తెలియాల్సి ఉంది.

Exit mobile version