Napoleons Hat : అలనాటి ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టే.. ఈ పేరు వినగానే డైనమిక్ బాడీ ల్యాంగ్వేజీతో, తలపై హ్యాట్ ధరించి గుర్రంపై కూర్చున్న ఒక నిలువెత్తు రూపం కళ్లెదుట కదలాడుతుంది. నెపోలియన్ ఆనాడు ధరించిన హ్యాట్‌ను తాజాగా రూ.17 కోట్ల రికార్డు ధరకు వేలం వేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓసెనాట్ అనే వేలం సంస్థ దీన్ని ఆదివారం వేలం వేసింది. 2014 సంవత్సరంలో ఇదే హ్యాట్‌ను ఓసెనాట్ సంస్థ వేలం వేయగా.. దక్షిణ కొరియాకు చెందిన ఒక వ్యాపారవేత్త రూ.16 కోట్లకు కొనుగోలు చేశారు. అనంతరం దాన్ని ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం జీన్ లూయీస్ నాయిసెజ్ దక్కించుకున్నారు. గతేడాది ఆయన చనిపోయారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ నెపోలియన్ హ్యాట్‌ను .. ఓసెనాట్ సంస్థ వేలం వేయగా మరో కోటి రూపాయలు అదనంగా రేటు పలికింది. దీంతో మునుపటి కొనుగోలు రికార్డు బద్దలైంది.
We’re now on WhatsApp. Click to Join.
- నెపోలియన్ హ్యాట్‌ను ‘బైకార్న్’ అని పిలుస్తారు.
- ఈ హ్యాట్ నలుపు రంగులో.. ఫ్రెంచ్ జెండాలోని నీలం-తెలుపు-ఎరుపు చిహ్నంతో అట్రాక్టివ్‌గా ఉంటుంది.
- నెపోలియన్ 15 సంవత్సరాలలో మొత్తం 120 హ్యాట్‌లను ధరించాడని అంటారు. వాటిలోనే ఇప్పుడు వేలం వేసిన హ్యాట్ కూడా ఒకటి.
- నెపోలియన్ 1804లో ఫ్రాన్స్ చక్రవర్తిగా పట్టాభిషక్తుడయ్యాడు.
- వాటర్‌లూలో బ్రిటిష్, ప్రష్యన్ దళాల మధ్య జరిగిన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత నెపోలియన్ 1815లో దేశ బహిష్కరణను ఎదుర్కొన్నాడు.
- 1821లో అట్లాంటిక్ మహాసముద్రంలోని సెయింట్ హెలెనా ద్వీపంలో నెపోలియన్(Napoleons Hat) మరణించాడు.
Also Read: Shiva Abhishekam: శివుడికి అభిషేకం చేస్తే కలిగే శుభాలివే..