Site icon HashtagU Telugu

Mukesh Ambani: గొప్ప మనసు చాటుకున్న ముఖేష్ అంబానీ.. నమ్మిన బంటుకి ఏకంగా అన్నీ రూ.కోట్లు బహుమతి?

Mukesh Ambani

Mukesh Ambani

ముఖేష్ అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనవంతులలో ముఖేష్ అంబానీ కూడా ఒకరు. కాగా ముఖేష్ అంబానీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్నది ఆయనకే తెలియదు. ఆయన ఒక రోజు సంపాదన కోట్లల్లో ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖేష్ అంబానీ రిలయన్స్ డిజిటల్ సంస్థకి అధినేత అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన తినే కంచం నుంచి ప్రయాణించే కార్య వరకు అన్నీ కూడా లగ్జరీవే అని చెప్పవచ్చు. కాబట్టి అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఏది చేసినా కూడా సంచలనమే చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు ముఖేష్ అంబానీ. ఈసారి ఏకంగా తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఆయన చేసిన పనికి చాలామంది షాక్ అవుతున్నారు. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా అంబానీ తన కంపెనీలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేస్తూ నమ్మిన బంటుగా ఉన్న ఒక ఉద్యోగికి కళ్లు చెదిరే కానుక ఇచ్చారు. ఖరీదైన కానుక అంటే ఈ లగ్జరీ కారు లేకపోతె అనుకుంటే పొరపాటు పడినట్లే. ఏకంగా దాదాపు రూ. 1500 కోట్ల విలువ చేసి 22 అంతస్తుల భవంతుని బహుమతిగా ఇచ్చారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న మనోజ్‌ మోదీకి అంబానీ అత్యంత ఖరీదైన బహుమతిని ఇచ్చారు.

రిలయన్స్‌ ఇతర కంపెనీలతో చేసుకున్న వందల కోట్ల ఒప్పందాల్లో మనోజ్‌ అత్యంత కీలక పాత్ర పోషించాడు. వ్యాపార వర్గాల్లో ఈయనను ముకేశ్‌ అంబానీ కుడి భుజంగా చెప్పవచ్చు. ప్రస్తుతం మనోజ్ రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియోకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని దశాబ్దాల పాటు కంపెనీకి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అంబానీ కొన్ని నెలల క్రితం ఈ గిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఆ బహుమతి విషయానికి వస్తే.. మనోజ్‌ కి కానుకగా ఇచ్చిన ఈ 22 అంతస్తుల భవంతి ముంబై లోని నేపియన్‌ సీ రోడ్డు ప్రాంతంలో ఉంది. బృందావన్‌ పేరుతో మొత్తం 1.7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అంతస్తుని నిర్మించారు. ఇందులో ఒక్కో అంతస్తు 8వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. పార్కింగ్‌ కోసమే 7 అంతస్తులను నిర్మించారు. ఇందులో కొన్ని అంతస్తుల్లో మనోజ్‌ మోదీ కుటుంబంతో నివసించనుండగా మరికొన్నింట్లో ఆయన ఇద్దరు కుమార్తెలు తమ అత్తింటి కుటుంబాలతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని కొంత ఫర్నిచర్‌ను ఇటలీ నుంచి తెప్పించారట. కాగా ప్రస్తుత మార్కెట్లో ఉన్న వర్గాల ప్రకారం, ఈ ప్రాంతంలో చదరపు అడుగు ధర రూ.45,100 నుంచి రూ.70,600 వరకు పలుకుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ 22 అంతస్తుల భవంతి ధర రూ.1500కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మనోజ్ ఎవరో కాదు ముఖేష్ అంబానీ చిన్ననాటి స్నేహితుడే.

Exit mobile version