Site icon HashtagU Telugu

Video Viral: రంగులు మారుస్తున్న అంబానీ లగ్జరీ కార్.. వీడియో వైరల్?

Video Viral

Video Viral

ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలకు సుపరిచితమే. ప్రపంచంలో ఉన్న అత్యంత ధనికులలో ముఖేష్ అంబానీ టాప్ ఫైవ్ లో ఉంటారు అని చెప్పవచ్చు. ఇక ఆయన ప్రయాణించే కార్లు, నివసించే ఇల్లు, తినే కంచం ఇలా ప్రతి ఒక్కటి కూడా లగ్జరీగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన దగ్గర కోట్ల విలువ చేసే లగ్జరీకార్లు వందల సంఖ్యలో ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

అయినప్పటికీ ఎప్పటికప్పుడు కోట్లలో విలువ చేసే కార్లను కొనుగోలు చేస్తూనే ఉంటారు ముఖేష్ అంబానీ. ఇది ఇలా ఉంటే తాతగా ముఖేష్ అంబానీ కారుకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. కారులో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా. ఉందండోయ్ కోట్ల రూపాయలు విలువ చేసే రోల్స్ రాయిస్ కారుకి ఇటీవల కోటి రూపాయలు పెట్టి, పెయింటింగ్‌,ఇతర మార్పులు చేసిన రంగులు మార్చే లగ్జరీ కారు రోల్స్ రాయిస్ కెమెరాకు చిక్కింది. కాగా ఇటీవల కోటి రూపాయలకు పైగా ఖర్చుపెట్టి మరీ పెయింటింగ్‌ వేయించిన రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీ కెమెరాకు చిక్కింది.

ఇక ఇన్‌స్టా యూజర్‌ దీన్ని పోస్ట్‌ చేశారు. ర్యాప్‌ షేడ్స్‌లైట్స్‌ మారుతున్న తీరు విశేషంగా నిలిచింది. అయితే నిజంగా ఇది రంగులు మార్చడం కాదు. సైకెడెలిక్ ర్యాప్ వివిధ షేడ్స్ లైట్ల క్రింద వివిధ రంగులను రిప్లెక్ట్‌ చేస్తుంది. అలా ఈ కారు రంగులు మారుతున్న భ్రమను మనకు కలిగిస్తుందన్న మాట. అంబానీ సొంతమైన రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర దాదాపు రూ.13.14 కోట్లు. సాధారణంగా, రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర రూ.6.8 కోట్ల నుండి ప్రారంభం. కానీ కోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే పెయింటింగ్, 21 అంగుళాల వీల్స్, ఇతర కస్టమైజేషన్ కారణంగా దీని ధర రూ.13.14 కోట్లకు పెరిగిందన్నట్టు. అంతేకాకుండా ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ 0001 కోసం ఏకంగా రూ. 12 లక్షలు చెల్లించారట ముఖేష్ అంబానీ. కాగా అంబానీ లగ్జరీ నివాసం ముంబైలోని రూ. 15,000 యాంటిలియా, రూ. 850 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌తో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, ల్యాండ్ రోవర్, లంబోర్ఘిని ఫెరారీ లాంటి టాప్‌ కార్లు అంబానీ ఇంట్లో ఉన్నాయి.