Viral Video: బస్సు టాప్ లేచిపోయిన కూడా ఆగని ప్రయాణం.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో?

మాములుగా మనం బస్సులో ప్రయాణించేటప్పుడు బస్సు చిన్న పంచరైన చాలామంది భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు. అలాంటిది బస్సు పై కప్పు ఎగిరిపోతే వినడానిక

  • Written By:
  • Publish Date - July 27, 2023 / 05:24 PM IST

మాములుగా మనం బస్సులో ప్రయాణించేటప్పుడు బస్సు చిన్న పంచరైన చాలామంది భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు. అలాంటిది బస్సు పై కప్పు ఎగిరిపోతే వినడానికి కాస్త భయంకరంగా ఉన్న ఇలాంటి ఘటన తాజాగా చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో కొందరు భయభ్రాంతులకు లోనవుతుండగా మరికొందరు సదరు బస్సు డ్రైవర్ పై మండిపడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన బస్సుకు సంబంధించిన ఈ వీడియోను ఒక వ్యక్తి సామాజిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అది వైరల్‌ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. గడ్చిరోలి జిల్లా అహేరి డిపోకు చెందిన ఎమ్‌ఎస్‌ ఆర్టీసీ బస్సుగా దాన్ని గుర్తించారు. ఈ ఘటనపై ఎమ్‌ఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్ శేఖర్‌ ఛన్నే స్పందించారు. గడ్చిరోలీ- అహేరీ మధ్య నడిచే బస్సు పై భాగం ఊడినా అలానే నడిపిన ఘటన మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణకు ఆదేశించాము ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాము అని వారు తెలిపారు.కాగా ఈ ఘటనపై అహేరి డిపో అధికారులు మాట్లాడుతూ.. బస్సు పైభాగం మొత్తం ఊడిపోలేదు.

కేవలం ముందు భాగంలో ఉన్న ఫైబర్‌ మాత్రమే ఊడిపోయింది. ఈ విషయం డ్రైవర్‌, ప్రయాణికులకు తెలియలేదు. పక్కనే వస్తున్న వాహనదారులు చెప్పడంతో బస్సు సిబ్బందే వీడియో తీయాలని సూచించినట్లు విచారణలో వెల్లడైంది అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. కొందరు సస్పెండ్ చేసి మంచి పని చేశారు అనగా ఇంకొందరు సస్పెండ్ చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్ చేస్తున్నారు.