Site icon HashtagU Telugu

Viral Video: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.. తోపుడు బండిపై తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన బాలుడు

mp

Resizeimagesize (1280 X 720) (2) 11zon

అనారోగ్యం (Sick)తో బాధపడుతున్న తండ్రిని ఆరేళ్ల బాలుడు చక్రాల బండి (Cart)పై ఎక్కించుకుని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి చేర్చాడు. శనివారం ఆ బాలుడు తన తల్లితో కలిసి బండిని తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని కొందరు చూడగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిల్లా బలియారి పట్టణంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబం గంటకు పైగా అంబులెన్స్ కోసం వేచి చూసింది. అయితే వాహనం రాకపోవడంతో పిల్లవాడు తన తండ్రిని హ్యాండ్‌కార్ట్‌పై ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వైరల్ అయిన ఈ వీడియోలో బాలుడు వాహనం వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు. మూడు కిలోమీటర్ల మేర ఆ బండిని తోసుకుంటూ వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో సింగ్రౌలీ జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని గ్రహించి శనివారం సాయంత్రం ఈ విషయంపై విచారణకు ఆదేశించింది.

సింగ్రౌలి అదనపు కలెక్టర్ డి.పి. బర్మాన్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల, రోగిని భార్య, కొడుకు హ్యాండ్‌కార్ట్‌పై తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చిందని తెలిసింది. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్, సివిల్ సర్జన్‌లను ఆదేశించామని ఆయన తెలిపారు. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లో ఆరోగ్య సౌకర్యాల దుస్థితిని తెలుపుతుంది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

సమాచారం ప్రకారం.. ఈ వీడియో సింగ్రౌలీ జిల్లాకు చెందినది. ఈ వీడియో సింగ్రౌలి జిల్లా ఆరోగ్య వ్యవస్థను బహిర్గతం చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ చిన్నారి తన తండ్రితో కలిసి చేరిన ఆసుపత్రి ముందు అంబులెన్స్ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీ కళ్ళు కూడా తడిగా మారుతాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి వయసు కేవలం 6 ఏళ్లు. ఈ విషయం సింగ్రౌలీ జిల్లాకు చెందినదని చెబుతున్నారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తండ్రిని హ్యాండ్‌కార్ట్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు ఆ బాలుడు చెప్పాడు.