Moon from Earth : భూమికి చంద్రుడు దూరం అవుతున్నాడా..? కొన్నేళ్ల తర్వాత అసలు చంద్రుడు కనిపించడా..?

చంద్రుడి (Moon) దక్షిణ ధ్రువంపై తొలిసారిగా ఇస్రో అడుగుపెట్టింది. ఈ శుభసూచికను దేశం మొత్తం పండగ చేసుకుంటుంది.

  • Written By:
  • Updated On - August 24, 2023 / 02:46 PM IST

Chandrayaan-3 : జాబిల్లి మీద మన జాతీయ జెండా కాలుమోపింది..నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ప్రతిఫలం దక్కింది.. ఎవరు కాలుమోపని చంద్రుడి ఫై మనం కాలుమోపం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా ఇస్రో (ISRO) అడుగుపెట్టింది. ఈ శుభసూచికను దేశం మొత్తం పండగ చేసుకుంటుంది. ప్రపంచం మొత్తం కూడా శభాష్ భారత్ అంటూ జై జైలు పలుకుతుంది. అయితే ఇప్పుడు చంద్రుడిపై కాలు మోపం అని సంబరపడాలో..లేక భూమికి చంద్రుడు దూరం అవుతున్నాడని బాధపడాలో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది.

రోజు రోజుకు భూమికి..చంద్రుడు (Moon) దూరం అవుతున్నాడని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. శాస్త్రవేత్తలు చెపుతున్న దానిప్రకారం.. చంద్రుడు భూమి (Earth)కి 3,84,400 కి.మీ దూరంలో ఉన్నాడట. కానీ 320 కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి 2,70,000 కి.మీ దూరంలోనే ఉండేవాడని వారు చెపుతున్నారు. ఇప్పుడున్న దూరం కంటే 70% దగ్గరగా ఉండేవాడని ..నేటితో పోలిస్తే 10 రెట్లు దగ్గరగా చందమామ ఉండేదని అంటున్నారు. భూభ్రమణ శక్తి కారణంగా చంద్రుడు..భూమికి క్రమంగా దూరం అవుతూ వెళ్తున్నాడట.

ప్రతి ఏడాది 3.78 సెంటీమీటర్ల మేర దూరం వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. చంద్రుడు భూమికి దూరంగా వెళ్లడం ద్వారా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత భూమి మీదున్నవాళ్లు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడలేరని అంటున్నారు. భూ భ్రమణం కక్ష్యలో చిన్న పాటి వంపుల కారణంగా భూమిపై పడుతున్న సూర్యకాంతి పరిమాణంపై ప్రభావం ఉంటోందట. ఈ భూభ్రమణాలు వాటి పౌనఃపున్యాలు చంద్రుడు, భూమి మధ్య దూరాన్ని కూడా నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2.46 బిలియన్ సంవత్సరాల క్రితం భూమికి చంద్రుడు ప్రస్తుతం ఉన్న దూరం కంటే 60,000 కి.మీ దగ్గరగా ఉండేదని పేర్కొంటున్నారు.

Read Also : Vishnu Priya Hot In Saree : ‘చిలకపచ్చ కోకలో’ విష్ణుప్రియ అందాల ఆరబోత..

అలాగే ఇప్పటివరకు చంద్రుడు తెల్లగా ఉంటాడని అనుకున్నాం..కానీ చంద్రుడు (Moon Color)తెలుపు రంగులో కాదు ముదురు బూడిద రంగులో ఉంటాడని అంటున్నారు. సూర్యుడి కాంతి చంద్రుడిపై పడి తెల్లగా వెలుగుతూ కనిపిస్తాడు. అంతే తప్ప తెల్లగా ఉండడని వారు అంటున్నారు. అంతేకాదు చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. వెలుతురును సృష్టించ లేడని, చంద్రుడిపై మీద కాలుమోపిన వ్యోమగాములు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికి భూమికి చంద్రుడు దూరం అవుతున్నాడనేది మాత్రం కాస్త ఖంగారుకు గురి చేస్తుంది. మొన్నటి వరకు చందమామ రావే..జాబిల్లి రావే అని పాడుకుంటూ గోరుముద్దలు తినిపించిన తల్లిదండ్రులు..రాబోయే కాలంలో చందమామ..పోయే…జాబిల్లి పోయే..అని పాడుకుంటూ గోరుముద్దలు తినిపిస్తారు కావొచ్చు.