Site icon HashtagU Telugu

Viral Video: ఐస్ క్రీమ్స్ ను క్షణాల్లో మాయం చేసిన కోతుల గుంపు ..

Monkeys Enjoyed Ice Cream

Monkeys Enjoyed Ice Cream

ఐస్ క్రీమ్ (Ice Cream) అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న వారి దగ్గరి నుండి ముసలి వారి వరకు అంత ఐస్ క్రీమ్ ను ఇష్టపడి తింటారు. కేవలం సమ్మర్ లోనే కాదు వర్షాకాలంలోనూ ఐస్ క్రీమ్స్ తినేవారు ఉన్నారు. కేవలం మనుషులకే కాదు కోతులకు (Monkeys ) కూడా ఐస్ క్రీమ్ కనిపిస్తే వదిలిపెట్టవు. లొట్టలులేసుకుంటూ తింటాయి. తాజాగా ఓ కోతుల గుంపు అలాగే చేసాయి. ఎదురుగా ఐస్ క్రీమ్ బండి రాగానే అమాంతం దానిపై పడి క్షణాల్లో మాయం చేసాయి.

కోతుల గుంపు ఐస్‌క్రీమ్ తినేందుకు ఎగబడుతుండటంతో వాటిని ఎవ్వరు అడ్డుకొనే ప్రయత్నం చెయ్యలేక పోయారు.. దాంతో అవన్నీ ఫ్రీగా చల్లని ఐస్ క్రిమ్స్ లాగించేసాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో ను చూసిన చాలామంది ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.