Site icon HashtagU Telugu

Monkey : గాంధీ జయంతి రోజున..కోతికి దొరికిన మందు బాటిల్..

Monkey Whisky Bottle

Monkey Whisky Bottle

గాంధీ జయంతి (Gandhi Jayanthi) రోజున మందుబాబులు పస్తులు ఉండాల్సిందే. దేశ వ్యాప్తంగా మద్యం (Wine Shops Close )షాపులను క్లోజ్ చేస్తారు. అందుకే చాలామంది ముందే రోజు మందు బాటిళ్లను కొనుగోలు చేస్తారు. అలాంటిది ఓ కోతి(Monkey)కి మాత్రం గాంధీ జయంతి రోజున మందు బాటిల్ చేతికి చిక్కింది. అది కూడా ఎక్కడో కాదు…పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగా..ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రం కాన్పూర్‌లో పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగా ఓ కోతికి మందు బాటిల్ లభించింది. కమిషనర్‌ కార్యాలయం ఎదుట పార్క్ చేసిన ఓ బైక్ ఫై కోతి ఎక్కింది. బైక్ పాకెట్ లో ఏదో ఉన్నట్లు అనిపించేసరికి దానిని ఓపెన్ చేసింది కోతి. అందులో మద్యం సీసా కన్పించడంతో దాన్ని బయటకు తీసింది. దాన్ని ఓపెన్ చేద్దామని ఎంతగానో ట్రై చేసింది కానీఓపెన్ కాలేదు. ఇది చూసిన కొంతమంది బిగ్గరగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయింది. కిందపడిన మద్యం సీసాలను ఓ కానిస్టేబుల్ తిరిగి బైక్‌ సంచిలో పెట్టాడు. ఆ సీసాలు కానిస్టేబుల్‌వేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Read Also : Bandaru Satyanarayana : టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్