Tomato : టమాటాలు కోసం ఆఖరికి కొండముచ్చు దొంగగా మారింది

ఓ ఇంట్లోకి చొరబడ్డ కొండముచ్చు..ఎదురుగా ఉన్న కూరగాయల బుట్ట ను చూసింది. అంతే అబ్బా టమాటా..అనుకోని చేతిలో పట్టుకొని వెళ్లిపోయింది

  • Written By:
  • Updated On - August 4, 2023 / 04:10 PM IST

టమాటా.. గత రెండు నెలలుగా వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధర కొండెక్కి కూర్చుకుంది. తగ్గమంటే..తగ్గేదెలా అంటుంది. రెండు నెలల క్రితం వరకు టమాటా లేని వంటిల్లు ఉండేది కాదు..కానీ ఇప్పుడు అన్ని టమాటా లేని వంటిల్లులే కనిపిస్తున్నాయి. కనీసం వాటిని చూసేందుకు కూడా సామాన్య ప్రజలు భయపడుతున్నారంటే వాటి ధర ఎంతగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ టమాటా రూ. 220 పలుకుతుంది. అయితే టమాటా పండించిన రైతులు ఈ రెండు నెలల్లోనే కోటీశ్వరులు అయ్యారు.

ఇక టమాటా (Tomato ) కున్న రేటు చూసి దొంగలు కూడా టమాటాలు దొంగతనాలు చేయడం..టమాటా రైతుల వద్దకు వెళ్లి బెదిరించి డబ్బు లాక్కోవడం..ఇంకొంతమంది అయితే హైవే లపై టమాటా లోడ్ లతో వెళ్తున్న వాహనాలకు అడ్డగించి..ఆ వాహనాలను ఎత్తుకెళ్లడం చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు టమాటా కు సంబదించిన ఏదొక వార్త హైలైట్ అవుతూనే ఉంది. అంతే కాదు టమాటా ధరలకు సంబందించి అనేక రకాల మీమ్స్‌, జోకులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా ఓ కొండముచ్చు (Monkey ) టమాటాల కోసం దొంగగా మారింది. దీనికి సంబదించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఓ ఇంట్లోకి చొరబడ్డ కొండముచ్చు..ఎదురుగా ఉన్న కూరగాయల బుట్ట ను చూసింది. అంతే అబ్బా టమాటా..అనుకోని చేతిలో పట్టుకొని వెళ్లిపోయింది. పక్కనే ఉన్న బంగాళా దుంపలను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. కేవలం టమోటాను మాత్రమే చేత పట్టుకొని వెళ్లిపోయింది. ఒక్కో టమాటా తీసుకుని తినటం మొదలు పెట్టింది. ముందుగా ఓ బంగాళదుంప నోట్లో పెట్టుకుంది.. కానీ, ఎదురుగా ఎవరో వచ్చినట్టుగా అనిపేంచేసరికి దానిని అక్కడే వదిలి..టమాటా ను మాత్రం తీసుకెళ్లింది. ఇదంతా ఎవరు వీడియో తీశారో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా ఆఖరికి కోతులు కూడా టమాటాల కోసం దొంగలుగా మారాయి అని నవ్వుకుంటున్నారు.