Women’s Fight With Robber In Begumpet : అగంతకుడు పై సివంగులై తిరగబడ్డ అక్కాచెల్లెళ్లు

ఇంట్లోకి చొరబడి గన్ తో బెదిరించినా వ్యక్తపై ఇద్దరు అక్కచెల్లెలు తిరగబడి..ఆ అగంతకుడ్ని పరుగులుపెట్టించారు

Published By: HashtagU Telugu Desk
Mother Daughter Chased Thie

Mother Daughter Chased Thie

మహిళలే (Women) కాదని చులకనగా చూస్తే..వారు సివంగులై తిరగబడితే వారి నుండి ప్రాణాలు కాపాడుకోవడం కష్టం. దీనికి నిదర్శనం తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటనే. చాలామంది అగంతకులు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తుంటారు. ఇంట్లో మగవారు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేయడం , వేధింపులకు గురి చేయడం చేస్తుంటారు. కొంతమంది మహిళలు వారి అఘాత్యాలకు బలి అయితే..మరికొంతమంది మాత్రం ఇంట్లోకి చొరబడ్డ అగంతకులఫై (Robbers) తిరగబడి వారి ప్రతాపాన్ని చూపిస్తుంటారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.

తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రసూల్‌పుర జైన్‌ కాలనీలో గురువారం మధ్యాహ్నం ఏ తరహా ఘటనే చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడి గన్ తో బెదిరించినా వ్యక్తపై ఇద్దరు అక్కచెల్లెలు తిరగబడి..ఆ అగంతకుడ్ని పరుగులుపెట్టించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నవరతన్‌ జైన్‌, ఆయన భార్య అమిత మేహోత్‌ రసూల్‌పురలోని పైగా హౌసింగ్‌కాలనీలో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో అమిత, ఆమె కుమార్తె, పనిమనిషి ఇంట్లో ఉన్నారు.
ఆ సమయంలో ప్రేమ్‌చంద్‌, సుశీల్‌కుమార్‌ కొరియర్‌ సర్వీసు వచ్చిందంటూ ఆ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. వారిని అమిత తలుపు బయటే ఉండాలని చెప్పింది. ఇంతలోనే హెల్మెట్‌ ధరించిన సుశీల్‌కుమార్‌ ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించాడు బ్యాగులోని నాటు తుపాకీ బయటకు తీసి ఆమెపై గురిపెట్టాడు. ఈ క్రమంలోనే ప్రేమ్‌చంద్‌ వంటగదిలోకి వెళ్లి పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని వారిని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో అమిత సుశీల్‌ను బలంగా కాలుతో నెట్టేసింది.

ఈ క్రమంలోనే ఆమె కుమార్తె కూడా రావడంతో అతడిని గట్టిగా ప్రతిఘటించారు. ఇద్దరిపైనా సుశీల్‌ దాడి చేస్తున్నా వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. గత్యంతరం లేక అతను తుపాకీ వదిలి పరారయ్యాడు. ఈ లోపు తల్లీకుమార్తెల కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ప్రేమ్‌చంద్‌ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. దీపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే సుశీల్‌ను జీఆర్పీ పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. అమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బేగంపేట పోలీసులు తెలిపారు. ఈ ఘటన లో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. వచ్చిన అఘంతకులు వీరికి తెలిసిన వారే అవ్వడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

ఏడాది క్రితం పనికావాలని ఈ ఇద్దరు వ్యక్తులు ఈ ఇంటికి వచ్చారు. అందుకు అంగీకరించిన యజమాని వారిని పనిలో పెట్టుకున్నాడు. వారు కొంతకాలంగా నమ్మకంగా ఉన్నట్టూ నటిస్తూ ఎక్కడెక్కడ ఏ వస్తువులూ ఉంటాయో గమనించారు. ఆ తర్వాత పని మానేశారు. ఇక ఇప్పుడు గన్ తో వచ్చి..బెదిరించారు. ప్రస్తుతం ఈ ఘటన కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Arvind Kejriwal: సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి ఎక్క‌డ ఉంచారో తెలుసా..?

  Last Updated: 22 Mar 2024, 10:49 AM IST