Site icon HashtagU Telugu

Viral Video : ఒక్కసారిగా వైరల్ గా మారిన మోక్షా సేన్‌గుప్తా..ఇంతకీ ఈమె ఏంచేసిందంటే..!!

Mokksha Sengupta Dance

Mokksha Sengupta Dance

Moksha Sengupta Powerful Dance : మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta)..ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మొన్నటి వరకు ఈమె అంటే ఎవరికీ తెలియదు..కానీ ఇప్పుడు ఈమె ఎవరు..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఈమె ఏంచేస్తుందో..? అంటూ ప్రతి ఒక్కరు ఆరా తీస్తున్నారు. అయితే ఇంతలా ఈమె వైరల్ కావడానికి కారణం..నడిరోడ్డు ఫై డాన్స్ వేయడమే..అది కూడా యువతికి జరిగిన అన్యాయంఫై నిరసన గా డాన్స్ చేయడమే..

సాధారణంగా హీరోయిన్లు వెండితెరకు , సోషల్ మీడియాకు లేదా ఓపెనింగ్స్ లలో మాత్రమే కనిపిస్తారు..బయట చాల తక్కువ. అలాంటిది నటి మోక్షా సేన్‌గుప్తా మాత్రం కోల్‌కతా రోడ్ల (Kolkata Roads) ఫై డాన్స్ (Mokksha Sengupta Dance) వేసి వైరల్ గా మారింది. కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన ( Kolkata Rape-Murder Case) దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా నిరసనలు , ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ ఘటనను ఖండిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta) ఆవేశంగా చేసిన డ్యాన్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎన్‌జీఓ సంస్థ దక్షిణ కోల్‌కతాలో వీధిలో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా ఈ నటి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె అందరి ముందే మాస్ స్టెప్పులతో.. రౌద్రంగా భద్రకాళిలా పవర్ ఫుల్ స్టెప్పులు వేసింది.

ఆమె ముఖంపై ఉన్న ఫెస్ ఎక్స్ ప్రెషన్స్ సైతం.. చాలా రౌద్రంగా ఉన్నాయి. ఆమె చేసిన పవర్‌ఫుల్ డ్యాన్స్ అందరినీ షాకింగ్ కు గురిచేసిందని చెప్పుకొవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు భద్రకాళీ వచ్చి డ్యాన్స్ చేస్తుందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఈమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. మొదట ఈమె ఉపాధ్యాయురాలిగా ప‌నిచేసింది. త‌ర్వాత న‌ట‌న‌వైపు అడుగులు వేసి , పలు సినిమాలు చేసింది. తెలుగు ఆడియ‌న్స్ కి అనువాద సీరియ‌ల్స్ తో మోక్ష సుప‌రిచిత‌మే. ఈ డాన్సు వీడియో గురించి మోక్ష స్పందించింది. ఈ ఘ‌ట‌న సమ‌యంలో హైద‌రాబాద్ లో ఉన్నా. విష‌యం తెలియ‌గానే సొంతూరుకి వ‌చ్చి నిర‌స‌న‌లో పాల్గొన్నా. ఓ క‌ళాకారిణిగా నిర‌స‌న‌లో భాగంగా వీధి ప్ర‌ద‌ర్శ‌న ఎంచుకున్నాను. అది ఇంత‌గా వైర‌ల్ అవుతుందనుకోలేదు. బాధితురాలికి అండ‌గా నేను చేసిన ఓ చిన్న ప్ర‌య‌త్నం మాత్ర‌మే` అని చెప్పుకొచ్చింది.

Read Also : Kejriwal : సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్‌ కేజ్రీవాల్