Site icon HashtagU Telugu

Narendra Modi: ఇది కదా అభిమానం అంటే.. అన్ని వేల వజ్రాలతో ప్రధాని మోడీ ఫోటో?

Narendra Modi

Narendra Modi

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల అనగా సెప్టెంబర్ 17న 73వ ఏట అడుగుపెట్ట బోతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సీజన్ కూడా కావడంతో, బీజేపీ వర్గాలు, మోదీ అభిమానులు ఈ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక అభిమాని చేసిన పనికి నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా అభిమాని చేసిన పనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫిదా అయ్యారు.

ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధానికి అత్యంత అరుదైన, ఖరీదైన బహుమతిని ఇవ్వాలనుకున్నాడు సూరత్ కు చెందిన ఆర్కిటెక్ట్ ఇంజనీర్ విపుల్ జేపీ వాలా. అనుకున్నదే ఆలస్యం వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా 7200 వజ్రాలతో మోదీ చిత్రపటాన్ని తయారు చేశారు జేపీ. ఇదేదో రికార్డ్ కోసం చేసిన ప్రయత్నం కాదు. ఈ వేల వజ్రాలతో తయారు చేసిన ఫొటో ఫ్రేమ్ ను ప్రధానికి బహుమతిగా అందించబోతున్నాడు ఈ ఆర్కిటెక్ట్. వేలాది వజ్రాలతో కూడిన ఈ చిత్రాన్ని రూపొందించడానికి సుమారు మూడున్నర నెలల సమయం పట్టిందని తెలిపారు జేపీ.

ఇందులో 4 రకాల వజ్రాలను ఉపయోగించాడట. 7200 వజ్రాలతో తయారు చేయడానికి ఎంత ఖర్చయిందనే విషయాన్ని మాత్రం అతడు బయటపెట్టలేదు. అయితే ఆ మధ్య అమెరికా వెళ్లినప్పుడు అధ్యక్షుడు జో బిడెన్ భార్యకు, ప్రధాని ఓ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. అది చూసి జేపీకి వజ్రాలతో మోదీ బొమ్మ తయారచేయాలనే ఆలోచన కలిగిందంట. నరేంద్ర మోడీపై సదరు అభిమాని చాటుకున్న అభిమానానికి అభిమానులు ఫిదా అయ్యారు.