Site icon HashtagU Telugu

Muthu Song : ‘ముత్తు’ పాటను పాడుతూ జపాన్ పెద్దాయన డ్యాన్స్.. వీడియో వైరల్

Muthu Song

Muthu Song

Muthu Song :  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు జపాన్‌లో ఎంత క్రేజ్ ఉందో మనకు బాగా తెలుసు. ఆయన సినిమాలు జపాన్‌లో బాగానే కలెక్షన్స్‌ను సాధిస్తుంటాయి. ఎన్నోసార్లు రజనీకాంత్ స్వయంగా జపాన్‌లో పర్యటించి అభిమానులను కలిసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా పాండిచ్చేరి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్‌ 77 ఏళ్ల కుబోకి శాన్‌ (Kuboki San)  విశిష్ట అతిథిగా హాజరయ్యారు.  ఆ వయసులోనూ ఆయనకు రజనీకాంత్‌పై అభిమానం తగ్గలేదు. ఈ కార్యక్రమం సందర్భంగా కుబోకి శాన్‌ రజనీకాంత్ ముత్తు (Muthu Song) సినిమాలోని ఒక పాటను పాడుతూ.. తన్మయంతో స్టెప్పులు వేశారు.

We’re now on WhatsApp. Click to Join

దీంతో కార్యక్రమానికి హాజరైన విద్యార్థులంతా చప్పట్లు, ఈలలు, కేకలతో మోత మోగించి మరీ.. కుబోకి శాన్‌ను మరింత ఎంకరేజ్ చేశారు. దీంతో ఆయన రెచ్చిపోయి ముత్తు సినిమా సాంగ్ మొత్తం స్టెప్పులేస్తూ పాడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా దాన్ని మూడు లక్షల మందికిపైగా చూశారు. కుబోకి శాన్ పాటను, డ్యాన్స్‌ను నెటిజన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. 77 ఏళ్ల వయసులోనూ ఆయన జోష్‌కు సలాం చేస్తున్నారు. జపనీయుల మనసులను రజనీకాంత్ గెలుచుకోవడం గర్వకారణం అని ఇంకొందరు నెటిజన్స్ కామెంట్లు పెట్టారు.రజనీకాంత్‌ నటించిన ‘ముత్తు’ సినిమా 1995లో రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా జపనీస్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.23.5 కోట్లకు పైగా వసూలు చేసింది. జపాన్‌ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రం అదే కావడం విశేషం.

Also Read :Passenger Trains : పేదల ప్యాసింజర్ రైళ్లు తిరిగొచ్చాయి.. ఇక పాత ఛార్జీలే

మలేషియా, జపాన్,​ సింగపూర్​లలోనూ  సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు భారీ ఫ్యాన్​ బేస్​ ఉంది. ‘బాషా’, ‘ముత్తు’ లాంటి సినిమాలు అక్కడి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడి ప్రజలు వాటిని రిపీటెడ్‌గా చూస్తారు.’పేట’, ‘దర్బార్​’, ‘అన్నాత్తే’​ కమర్షియల్​గా అక్కడ హిట్ కొట్టాయి.  గతేడాది ఆగస్టులో ‘జైలర్’ సినిమా థియేటర్లలోకి వచ్చింది.జైలర్‌ సినిమాను చూసేందుకు అప్పట్లో జపాన్‌లోని ఒసాకా నుంచి ఒక జంట చెన్నైకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలైంది. కానీ తలైవా గడ్డపైనే జైలర్‌ను చూడాలని వారు ఇంత దూరం వచ్చినట్టు రజనీకాంత్‌ జపాన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ లీడర్‌ యసుదా హిడెతోషి తెలిపారు. ఆయన రజనీ పేరుతో జపాన్‌లో పలు సేవా కార్యక్రమాలు చేశారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాల కోసం జపాన్‌కు రజనీ వెళ్తే ఆ ఏర్పాట్లన్నీ యసుదానే చూసుకుంటారు.

https://twitter.com/Ananth_IRAS/status/1763838308042584441?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1763838308042584441%7Ctwgr%5Eca1ce748d1922e23d3e61df60a6d258d33f8e532%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-34819005422003095713.ampproject.net%2F2402141842000%2Fframe.html

Also Read : Kiraak RP: నెల్లూరు చేపల పులుసు ధరల విమర్శలపై ఘాటుగా స్పందించిన కిరాక్ ఆర్పి?