Turkey baby: టర్కీలో అద్భుత పరిణామం..మృత్యువును జయించి 52 రోజుల తర్వాత తల్లి చెంతకు బిడ్డ ఇదొక అద్బుతం.. 52 రోజుల తర్వాత తల్లి దగ్గరకు పాప

టర్కీలో భూకంప శిధిలాల్లో చిక్కుకుని మృత్యువును జయించిన పసిపాప ఇప్పుడు ఎట్టకేలకు తల్లి వద్దకు చేరుకుంది.

  • Written By:
  • Publish Date - April 3, 2023 / 09:08 PM IST

Turkey baby: టర్కీలో భూకంప శిధిలాల్లో చిక్కుకుని మృత్యువును జయించిన పసిపాప ఇప్పుడు ఎట్టకేలకు తల్లి వద్దకు చేరుకుంది. రెండు నెలల క్రితం టర్కీ, సిరియాలలో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. వరుస భూకంపాల ధాటికి ఎన్నో బిల్డింగ్ లు నేలమట్టం అయ్యాయి. ఈ భూపంకాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు రెండు దేశాల్లో కలిపి 57 వేలకుపైగా మంది వరకు శిథిలాల్లో చిక్కుకుని మరణించారు.

అయితే టర్కీలో భూకంపం సమయంలో ఓ రెండు నెలల పసిపాప శిథిలాల కింద చిక్కుకున్న ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియా వైరల్ గా మారాయి. 128 గంటల తర్వాత ఈ పాప మృత్యుంజయురాలిగా బయటపడ్డ విషయం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే శిథిలాల కింద చిక్కుకుని పాప తల్లి చనిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ పాప తల్లి బ్రతికే ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో తాజాగా పాపను తల్లి దగ్గరకు అధికారులు చేర్చారు. ఉక్రెయిన్ మంత్రి గెరాషెంకో దీనిపై తాజాగా ట్వీట్ చేశాడు. 54 రోజుల తర్వాత డీఎన్‌ఏ టెస్ట్ తర్వాత బిడ్డను తల్లి చెంతకు చేర్చారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శిథిలాల్లో చిక్కుకుని పాప తల్లి చనిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయని, అవి నిజం కాదని తెలిందన్నారు. పాప తల్లి వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె బతికే ఉందని తెలిపారు. ప్రపంచంలోనే ఏదైనా అద్భుతం ఉందంటే.. అది తల్లి,బిడ్డను కలపడమేనని ఆంటన్ గెరాషెంకో తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.దాదాపు 54 రోజుల తర్వాత తల్లి,బిడ్డను కలవపడం అద్భుతమంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.