Site icon HashtagU Telugu

Portugal: రోడ్లపై ఏరులై పారుతున్న వైన్.. నెట్టింట ఫొటోస్ వైరల్?

Portugal

Portugal

మామూలుగా భారీ వర్షాలు పడినప్పుడు రోడ్డుపై వరదనీరుపారడం అన్నది సహజం. అటువంటి సమయంలో రోడ్లన్నీ వీధులన్నీ కూడా వరద నీటితో నదులను తలపిస్తూ ఉంటాయి. అలాంటిది వైన్ ఒక నదిలా ప్రవహించడం ఎప్పుడైనా చూశారా. వైన్ ఏంటి? వీధుల్లో ప్రవహించడం ఏంటి అని అనుకుంటున్నారా! వినడానికి చాలా అమేజింగ్ గా ఉన్న ఇది నిజం. ఒక ప్రదేశంలో వైన్ ఏకంగా వీధుల్లో వరద నీరు మాదిరి ప్రవహించింది. ఈ ఘటన పోర్చుగల్‌ లోని సావో లోరెంకో డి బైరో అనే చిన్న పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పట్టణ సమీపంలో లెవిరా డిస్టిలరీ ఉంది.

2 మిలియన్‌ లీటర్ల రెడ్‌ వైన్‌తో ఉన్న బారెల్స్‌ను వేరొక చోటుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ఆ బారెల్స్‌ పగిలిపోవడంతో పట్టణంలోని వీధుల్లో రెడ్‌ వైన్‌ ఏరులై పారింది. స్థానికులంతా ఈ ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌ను నింపేంత వైన్‌ వీధుల వెంట ప్రవహించింది. సమాచారం అందుకున్న అధికారులు రెడ్‌ వైన్‌ ప్రవాహాన్ని స్థానిక నదిలో కలవకుండా.. వేరే ప్రాంతానికి మళ్లించినట్లు స్థానిక మీడియా ప్రచురించింది. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

అనుకోకుండా ఈ సంఘటన జరిగింది..బారెల్స్‌ పగిలి రెడ్‌ వైన్‌ పట్టణ వీధుల్లో ప్రవహించింది. దీనికి పూర్తి బాధ్యత మాదే. వీధులను మేమే శుభ్రపరుస్తాము. ఈ తప్పిదానికి పట్టణ వాసులను క్షమాపణలు కోరుతున్నాం అని లెవిరా డిస్టిలరీ ఒక ప్రకటనలో తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ప్రదేశంలో నేను ఉంటే కనుక ఆ వైన్ ని మా ఇంట్లో దాచిపెట్టుకునేవాడిని అని కొందరు కామెంట్ చేయగా అదృష్టం చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.