ప్రపంచం (World) లోని ఏడు వింతలు అని మొన్నటి వరకు అంత మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు అంకెలతో సంబంధం లేకుండా ప్రతి రోజు ఎవ్వరు నమ్మలేని..వింతలు వెలుగులోకి వస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ వింతలు చూసి చాలామంది ఇదంతా దేవుడి లీల అని మాట్లాడుకుంటున్నారు. రెండు తలలతో జంతువులు జన్మించడం..దేవుడి విగ్రహాలు పాలు తాగడం..ఇలాంటి ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల శ్రీశైలం లో శివలింగం చుట్టూ నాగుపాము (Cobra) సంచరించిన వీడియో వైరల్ కాగా..తాజాగా ఓ వేప చెట్టు నుండి పాలు (Milk from Neem Tree) కారడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. మూగి తిమ్మరెడ్డికి చెందిన పొలంలోని వేప చెట్టు నుంచి ధారగా పాలు కారుతున్నాయి. చెట్టుపై 12 అడుగుల నుంచి పాలధార నిరంతరం కారుతూనే ఉంది. ఈ వార్త తెలియడంతో… జనాలు తండోపతండాలుగా వచ్చి చూసి వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. మరి కొంతమంది వేప చెట్టు నుంచి కారుతున్న పాలను కవర్లలో నింపుకొని ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. ఇదిలా ఉంటే భారీగా కురిసే వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరిగి పాలు రూపంలో ఉన్న ఒక ద్రవం కారుతోందని ప్రకృతి నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇది దేవుడి మాయే అని అంటున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని.. ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Rahul: వయనాడ్ ఘటన.. బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయండి: రాహుల్