Viral Catch: అసాధారణ క్యాచ్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

బిగ్‌బాష్ లీగ్ 13వ సీజ‌న్ ముగిసింది.  ఫైన‌ల్ మ్యాచులో బ్రిస్బేన్ హీట్‌, సిడ్నీ సిక్స‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో 54 ప‌రుగుల‌తో గెలుపొందిన‌ బ్రిస్బేన్ హీట్ బీబీఎల్ 13వ సీజ‌న్ విజేత‌గా నిలిచింది

Published By: HashtagU Telugu Desk
Michael Neser Catch

Michael Neser Catch

Viral Catch:  బిగ్‌బాష్ లీగ్ 13వ సీజ‌న్ ముగిసింది.  ఫైన‌ల్ మ్యాచులో బ్రిస్బేన్ హీట్‌, సిడ్నీ సిక్స‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో 54 ప‌రుగుల‌తో గెలుపొందిన‌ బ్రిస్బేన్ హీట్ బీబీఎల్ 13వ సీజ‌న్ విజేత‌గా నిలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ ఎనిమిది వికెట్లకు 166 పరుగులు చేసింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ 112 పరుగులకే ఆలౌటయ్యింది. ఏ దశలోనూ ఆ జట్టు పోరాటపటిమ చూపలేదు. బ్రిస్బేన్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు.

ఇదిలా ఉంటే.. సిడ్నీ ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఓ సంద‌ర్భంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్ష‌కులు అంద‌రూ మునివేళ్ల‌పై నిల‌బ‌డ్డారు. ఆ క్షణంలో స్టేడియంలో ఉన్న వారంతా ఊపిరి బిగపట్టారు. ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో జేవియ‌ర్ బార్లెట్ బౌలింగ్‌లో సిడ్నీ బ్యాట‌ర్ సీన్ అబాట్ లాంగ్ దిశ‌గా భారీ షాట్ ఆడాడు. బంతి కాస్త గాల్లోకి లేచింది. ఆల్మోస్ట్ ప్రతిఒక్కరు సిక్స్ అందుకున్నారు. కానీ బౌండ‌రీ లైన్ వ‌ద్ద మైకేల్ నీస‌ర్ ఫీల్డింగ్ చూస్తే ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది.

సిక్స్ లైన్ లో మైఖేల్ బాల్‌ను అందుకున్నాడు అయితే అతను బ్యాలెన్స్ మిస్సవ్వడంతో బౌండ‌రీ లైన్‌ను క్రాస్ చేసే స‌మ‌యంలో బాల్‌ను మైదానంలోకి విసిరేశాడు. ఆ వెంటనే అలెర్ట్ అయిన మరో ఫీల్డర్ పాల్ వాల్టెర్ బంతిని అందుకున్నాడు. క్షణాల్లో జరిగిన ఆ క్యాచ్ పై ఎంపైర్ కూడా నిర్ణయం ప్రకటించలేకపోయాడు. ఔటా, నాటౌటా అని తేల్చడానికి థర్డ్ అంపైర్ చాలా సమయం తీసుకున్నాడు. మొత్తంగా ఔట్ అని ప్రకటించాడు.దీంతో అబాట్ ఔట్ కాగా.. ఈ అద్భుత క్యాచ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read: CM Revanth Reddy: గుంపు మేస్త్రి అన్న వాళ్ళ చంప చెళ్లుమనిపించిన సీఎం రేవంత్

  Last Updated: 25 Jan 2024, 07:29 PM IST