Free Bus : సీటు కోసం బస్సులో కొట్టుకున్న మగవారు

తొర్రూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న బస్సులో భర్తలు తమ భార్యలకు సీటు కోసం కర్చీఫ్‌ వేశారు

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 12:45 PM IST

సాధారణంగా బస్సు, రైళ్లలో మనం చాలా సార్లు చూసి ఉంటాం.. సీట్ల కోసం గొడవలు పడటం.. ఒకరిని మరొకరు తోసుకోవడం…కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Cong Govt) తీసుకొచ్చిన మహిళ ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం..కొట్లాటలకు దారిస్తుంది. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ప్రతి రోజు పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకొంటూ… అడ్డొచ్చినవారిని కూడా వదలడం లేదు. కొన్నిసార్లు ఆ గొడవలు చేతులు దాటి ..రోడ్ ఫై కొట్టుకునే స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఏకంగా మగవారు సైతం సీటు కోసం కొట్టుకున్న ఘటనలు కూడా మొదలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కు సెలవులు మొదలు కావడం తో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో సీటు కోసం విపరీతమైన పోటీ ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఓ సీటు కోసం ఇద్దరు మహిళల గొడవ కాస్త భర్తలు కొట్టుకునే స్థాయికి వచ్చింది. ఈ సంఘటన మహబూబాబాద్‌లో వెలుగు చూసింది. తొర్రూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న బస్సులో భర్తలు తమ భార్యలకు సీటు కోసం కర్చీఫ్‌ వేశారు. ఒకరు ఆపిన సీటులో మరొకరు కూర్చుకోవడంతో మహిళలు తిట్ల దండకం మొదలుపెట్టారు. ఈ వాదనలు విన్న ఇరువురి భర్తలు రంగంలోకి దిగారు. ముందుగా మాటలతో మొదలైన ఈ గొడవ.. చివరకు చెప్పులతో కొట్టుకొనేవరకు వెళ్లింది. ఇక తోటి ప్రయాణికులు వారిని ఆపే ప్రయత్నం చేసినా.. వారు ఆగలేదు. కండక్టర్ ఫిర్యాదుతో పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. ఇక ఈ గొడవను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also : DRDO : భద్రతా బలగాల కోసం అత్యంత తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్: డీఆర్‌డీవో